Rana Daggubati : బాలయ్య రికార్డులను బ్రేక్ చేయడానికి.. గట్టి ప్లాన్ వేస్తున్న రానా.. ఏంటో తెలుసా..!

బాలయ్య రికార్డులను బ్రేక్ చేయడానికి రానా దగ్గుబాటి గట్టి ప్లాన్ వేస్తున్నారు. అదేంటో తెలుసా..?

Rana Daggubati : బాలయ్య రికార్డులను బ్రేక్ చేయడానికి.. గట్టి ప్లాన్ వేస్తున్న రానా.. ఏంటో తెలుసా..!

Rana Daggubati preparing master plan to break balakrishna records

Rana Daggubati : టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి.. చివరిగా ‘విరాటపర్వం’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ తరువాత ‘స్పై’ మూవీలో గెస్ట్ అపిరెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం రజినీకాంత్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. అలాగే తనకి ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో కలిసి ‘రాక్షస రాజా’ అనే సినిమా చేస్తున్నారు.

కాగా రానాకి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ వరకు ప్రతి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. బాహుబలి కంటే ముందే బాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న రానా.. ఇటీవల ‘రానా నాయుడు’తో మరింత ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఇక సౌత్ టు నార్త్ మంచి గుర్తింపు ఉన్న రానాతో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో.. ఒక పాన్ ఇండియా టాక్ షోని సిద్ధం చేస్తుందట.

Also read : Priyanka Chopra : అయోధ్య రామ మందిరంలో.. ప్రియాంక చోప్రా కుటుంబం సందడి..

రానా గతంలో ‘నంబర్ 1 యారీ’ అనే టాక్ షోకి హోస్టుగా చేసి సూపర్ సక్సెస్ సాధించారు. ఇప్పుడు ‘ది రానా కనెక్షన్’ పేరుతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ టాక్ షోని అమెజాన్ ప్రైమ్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది. రానా హోస్ట్ చేసే ఈ షోని పాన్ ఇండియా స్థాయిలో చేయబోతున్నారట. ఇప్పటివరకు ఉన్న టాక్ షోలు అన్ని ఆయా భాషల్లోనే స్టార్స్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి.

కానీ ఇప్పుడు ఈ షోకి గెస్టులుగా నార్త్ టు సౌత్ ఇండస్ట్రీలోని స్టార్స్ ని తీసుకు వచ్చేలా అమెజాన్ ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతం ఉన్న టాక్ షోల్లో ‘కాఫీ విత్ కరణ్’, ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే’, షోలు కొన్ని రికార్డులను సృష్టించాయి. ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్ చేసేందుకు.. రానా పాన్ ఇండియా టాక్ షోతో గట్టి ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ టాక్ షో ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందో చూడాలి.