Priyanka Chopra : అయోధ్య రామ మందిరంలో.. ప్రియాంక చోప్రా కుటుంబం సందడి..

అయోధ్య రామ మందిరంలో ప్రియాంక చోప్రా కుటుంబం సందడి. ట్రెడిషనల్ లుక్స్ లో ప్రియాంక కూతురు క్యూట్ లుక్స్ నెటిజెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

Priyanka Chopra : అయోధ్య రామ మందిరంలో.. ప్రియాంక చోప్రా కుటుంబం సందడి..

Priyanka Chopra Nick Jonas seeks blessings at Ram Mandir with their daughter Maltie

Updated On : March 20, 2024 / 5:40 PM IST

Priyanka Chopra : అందాల భామ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ పాప్ సింగర్ ‘నిక్ జోనాస్’ని పెళ్లి చేసుకొనే అక్కడే సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫిషనల్ లైఫ్‌ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఇక్కడి ఆడియన్స్ కి సోషల్ మీడియా ద్వారానే టచ్ లో ఉంటున్న ప్రియాంక చోప్రా.. అప్పుడప్పుడు ఇండియా వచ్చి ఇక్కడి అభిమానులను పలకరిస్తూ ఉంటారు.

తాజాగా ఈ భామ ఫ్యామిలీతో సహా ఇండియాకి వచ్చారు. భర్త నిక్, కూతురు మాల్తీతో కలిసి ప్రియాంక గత కొన్నిరోజుల నుంచి ముంబైలోని పలు ఈవెంట్స్ అండ్ పార్టీస్ కి అటెండ్ అవుతూ సందడి చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఇషా అంబానీ ఏర్పాటు చేసిన హోలీ పార్టీలో కూడా ప్రియాంక ఫ్యామిలీ సందడి చేసారు. తాజాగా ఈ స్టార్ కుటుంబం.. అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకున్నారు.

Also read : Samantha – Tamannaah : ఒక్క ఫొటోతో తమన్నా, విజయ్ డేటింగ్‌ని బయటపెట్టేసింది సమంత..

ప్రియాంక, నిక్, మాల్తీ ట్రెడిషనల్ వెర్ లో రామ మందిరానికి వచ్చి రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆశీసులను అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పిక్స్ లో మాల్తీ క్యూట్ లుక్స్ నెటిజెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

ఇక ప్రియాంక ప్రొఫిషినల్ లైఫ్ విషయానికి వస్తే.. ఇటీవల ఆస్కార్ నామినేషన్స్ లో ప్రియాంక ప్రొడ్యూస్ చేసిన ‘టు కిల్ ఏ టైగర్’ అనే డాక్యుమెంటరీ ఫిలిం ఎంపిక అయ్యింది. ఈ ఫిలింకి ప్రియాంక ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈమె జూన్ సీనతో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇండియన్ ఆడియన్స్.. ప్రియాంకని మళ్ళీ ఇక్కడ సినిమాల్లో చూడాలని అనుకుంటున్నారు. మరి అది ఎప్పటికి సెట్ నెరవేరుతుందో చూడాలి.