8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే.. ఈ జనవరిలో డీఏ ఎంత పెరగొచ్చంటే?

8th Pay Commission : 2026 జనవరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ లభించే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సులకు ముందు డీఏ, డీఆర్ 5శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది.

8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే.. ఈ జనవరిలో డీఏ ఎంత పెరగొచ్చంటే?

8th Pay Commission (Image Credit To Original Source)

Updated On : January 10, 2026 / 8:23 PM IST
  • జనవరిలో డీఏ, డీఆర్ 5శాతం వరకు పెంపుపై ఊహాగానాలు
  • డియర్‌నెస్ అలవెన్స్ 63శాతానికి పెరుగుతుందని అంచనా.
  • 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు బిగ్ రిలీఫ్?

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. 8వ వేతన సంఘం అమలుకు ముందే డీఏ పెంపై కీలక అప్‌డేట్ వచ్చింది. 2026 జనవరిలో డీఏ పెంపు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదేగాని జరిగితే ఈసారి డీఏ, డీఆర్ 5 శాతం పెరిగే అవకాశం ఉంటుందని అంచనా. వాస్తవానికి, ప్రస్తుత రోజుల్లో ద్రవ్యోల్బణం రోజువారీ ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఇంటి అద్దెలు, రేషన్లు, మందులు, పిల్లల చదువులు కూడా అంతకంతకూ ఖరీదైనవిగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో జీతం, పెన్షన్ పెంపు వార్త బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఈ జనవరిలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. 8వ వేతన సంఘం అమల్లోకి రానున్న నేపథ్యంలో డియర్నెస్ అలవెన్స్ (డీఏ పెంపు) డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)లో 5శాతం పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు.

డీఏ, డీఆర్‌లో 5శాతం పెంపు సాధ్యమే :
కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నవంబర్ 2025 సంవత్సరానికి AICPI-IW (పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక)ను 148.2 వద్ద విడుదల చేసింది. డీఏ, డీఆర్ ఈ సూచికకు నేరుగా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది.

8th Pay Commission

8th Pay Commission (Image Credit To Original Source)

దేశవ్యాప్తంగా ఆహారం, గృహనిర్మాణం, దుస్తులు, ఇంధనం, ఆరోగ్యం, రవాణా విద్య వంటి ముఖ్యమైన వస్తువుల ధరలలో మార్పులను సూచిస్తుంది. ప్రస్తుత డేటా ఆధారంగా, డీఏ, డీఆర్ 2026 జనవరిలో 5 శాతం పాయింట్ల వరకు పెరగవచ్చు.

జనవరిలో డీఏ 63శాతానికి పెరగొచ్చు :
కేంద్ర ప్రభుత్వం జూలై 2025లో డీఏని 4శాతంగా పెంచి 58శాతానికి పెంచింది. గతంలో ఇది 54శాతంగా ఉంది. ఈ జనవరిలో 5శాతం పెంపుదల ఆమోదిస్తే.. డీఏ 61శాతం నుంచి 63 శాతానికి చేరుకుంటుంది. అయితే, డిసెంబర్ 2025 AICPI-IW డేటా విడుదలైన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read Also : Fake GST Notices : మీకు GST నోటీసు వచ్చిందా? అది ఫేక్ నోటీసా కాదా? జస్ట్ 30 సెకన్లలో తెలుసుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

8వ వేతన సంఘం అమలు ఎప్పుడంటే? :

కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే కమిషన్ వర్క్ మొదలైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్‌టైమ్ సభ్యుడిగా పంకజ్ జైన్ సభ్య-కార్యదర్శిగా నియమితులయ్యారు. కమిషన్ నిబంధనలు (ToR) కూడా ఖరారు అయ్యాయి.

ప్రభుత్వ కాలక్రమం ప్రకారం.. కమిషన్ సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమలు అవుతాయి. అయితే, రిపోర్టు అమలుకు రెండు ఏళ్ల వరకు పట్టవచ్చని నిపుణులు అంటున్నారు. అప్పటి వరకు, జీతాలు, పెన్షన్లు 7వ వేతన సంఘం పరిధిలోనే ఉంటాయి. డీఏ పెంపు తాత్కాలిక రిలీఫ్ మాత్రమే అందిస్తుంది.

ఎవరికి ఎంత లాభం? :
ఈ జనవరిలో పెంపు ఉంటే.. 5 మిలియన్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సుమారు 6.9 మిలియన్ల పెన్షనర్ల నెలవారీ ఆదాయం పెరుగుతుంది. నిరంతర ద్రవ్యోల్బణం మధ్య ఈ పెంపు భారీ ఉపశమనం పొందవచ్చు.