Mahesh Babu : అమ్మతో ఉన్న ఫోటో షేర్ చేసి.. మిస్ యు అమ్మ అంటూ మహేష్ బాబు.. పోస్ట్ వైరల్

మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి రెండేళ్ల క్రితం సెప్టెంబర్ 2022 లో మరణించిన సంగతి తెలిసిందే.

Mahesh Babu Shares Emotional Post While Remembering his Mother

Mahesh Babu : నేడు మహేష్ బాబు తల్లి పుట్టిన రోజు అవ్వడంతో మహేష్ బాబు తన సోషల్ మీడియాలో అమ్మతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసారు. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి రెండేళ్ల క్రితం సెప్టెంబర్ 2022 లో మరణించిన సంగతి తెలిసిందే.

Also Read : Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ కొడుకు నీల్ పుట్టిన రోజు వేడుకలు.. ఫోటోలు వైరల్..

అమ్మ పుట్టిన రోజుని గుర్తు చేసుకుంటూ తల్లితో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే అమ్మ. మాటల్లో చెప్పలేనంత మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా పలువురు ఫ్యాన్స్ కూడా మహేష్ తల్లికి హ్యాపీ బర్త్ డే చెప్తూనే మహేష్ ని స్ట్రాంగ్ గా ఉండమని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తవ్వగా మూడో షెడ్యూల్ త్వరలో మొదలవ్వనుంది.