Jayamma Panchayathi: స్టార్ హీరోలందరినీ వాడేస్తున్న జయమ్మ.. ఈసారి ఎవరంటే?

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల చాలా ఏళ్ల తరువాత వెండితెరపై లీడ్ రోల్‌లో నటిస్తూ చేస్తున్న సినిమా ‘జయమ్మ పంచాయతీ’. ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని...

Mahesh Babu To Release Jayamma Panchayathi Release Trailer

Jayamma Panchayathi: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల చాలా ఏళ్ల తరువాత వెండితెరపై లీడ్ రోల్‌లో నటిస్తూ చేస్తున్న సినిమా ‘జయమ్మ పంచాయతీ’. ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ భారీ స్థాయి సినిమాకు ఏమాత్రం తగ్గకుండా దగ్గరుండి మరీ నిర్వహిస్తోంది ఈ స్టార్ యాంకర్. ఇక ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు పలువురు స్టార్ హీరోలు కూడా ముందుకు రావడంతో జయమ్మ పంచాయతీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Jayamma Panchayathi : జయమ్మ కోసం ఇద్దరు అందగాళ్ళు

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన సుమ.. థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయడంతోనే ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పవన్ కూడా సుమ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాలో సుమదే పై చేయి ఖచ్చితంగా ఉంటుందని, అందుకే అందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరాడు. ఇక జయమ్మ పంచాయతీ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు దిగొచ్చారు. అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నానిలు కలిసి ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా వచ్చి జయమ్మ పంచాయతీ అండ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Jayamma Panchayathi: పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జయమ్మ పంచాయితీ ట్రైలర్ రిలీజ్

అయితే సుమ ఇక్కడితో ఆగాలని అనుకోవడం లేదు. సినిమా రిలీజ్‌కు కేవలం మూడు రోజులే సమయం ఉండటంతో, మరోసారి ప్రేక్షకుల్లోకి తన సినిమాను తీసుకెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. ఈసారి రంగంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబును పట్టుకొస్తుందట ఈ బ్యూటీ. జయమ్మ పంచాయతీ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను మహేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తే, అది జనంలోకి మరింతగా వెళ్తుందని ఆమె ప్లాన్ చేసింది. దీనికి మహేష్ బాబు కూడా ఓకే అనేశాడు. ఇక జయమ్మ పంచాయతీ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను రేపు(ఏప్రిల్ 4న) ఉదయం 10.08 గంటలకు మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు సుమ అండ్ టీమ్ రెడీ అయ్యారు. దర్శకుడు విజయ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.