Jayamma Panchayathi: పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జయమ్మ పంచాయితీ ట్రైలర్ రిలీజ్
బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల చాలా కాలం తరువాత లీడ్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయతీ’.. ఈ సినిమా మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు....

Pawan Kalyan Launches Suma's Jayamma Panchayathi Trailer
Jayamma Panchayathi: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల చాలా కాలం తరువాత లీడ్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’.. ఈ సినిమా మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే రిలీజ్ కాగా, అవి సినిమాపై ఉన్న అంచనాలను పెంచేశాయి. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ చూస్తే జయమ్మ పంచాయితీ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
Jayamma Panchayathi : సుమ ర్యాప్ పాడితే అదిరిపోద్దంతే..
ఇక ఈ సినిమాలో జయమ్మ అనే పాత్రలో సుమ తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేందుకు రెడీ అయ్యింది. తన కుటుంబమే సర్వస్వం అనుకునే మహిళగా, ఊళ్లోజనానికి తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇప్పించాలంటూ పంచాయితీ పెడుతుంది జయమ్మ. అయితే ఊరిజనం మాత్రం తమకు చాలా సమస్యలు ఉన్నాయని.. జయమ్మ డబ్బులు తరువాత ఇస్తామని అంటారు. ఈ క్రమంలో సాగే కథ ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు ఈ సినిమా ట్రైలర్ చూస్తే మనకు అర్థం అవుతోంది.
Jayamma Panchayathi : సుమ సినిమా సాంగ్ అదిరిపోయిందిగా..
జయమ్మ పాత్రలో సుమ ఒదిగిపోయిన విధానం మనకు ట్రైలర్‌లోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అదనపు ఆకర్షణగా మారనుంది. విజయ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను బలగ ప్రకాశ్ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను మే 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మరి జయమ్మ పంచాయితీ చిత్రం సుమకు ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తుందో తెలియాలంటే మే 6 వరకు వెయిట్ చేయాల్సిందే.