సీట్ ఎడ్జ్ థ్రిల్లర్…శేష్‌కు మహేష్ అభినందనలు

అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఎవరు’. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ హీరోలంతా శేష్ కు,డైరెక్టర్ కు పర్సనల్ గా ఫోన్ చేయడమే కాకుండా.. సోషల్ మీడియా ద్వారా కూడా ప్రశంసిస్తున్నారు. తాజాగా మెగాస్టార్, అల్లూ అర్జున్ ఈ సినిమాను తెగ పొగిడేశారు.
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమా చూసి థ్రిల్ అయ్యానని.. ప్రతి సీన్ అద్భుతంగా ఉందని.. ఊహించని మలుపులు, ట్విస్టులతో ఉన్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారంటూ సినిమాను మెచ్చుకున్నారు. అంతేకాదు గొప్ప స్క్రీన్ ప్లేతో అద్భుతంగా సినిమాను ఎగ్జ్‌క్యూట్ చేశారు.. అడివిశేష్ సహా ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు అంటూ మహేష్ ట్విట్ చేశారు.
అయితే మహేశ్ ట్విట్ కి అడివిశేష్ స్పందిస్తూ… ‘మేజర్’ సినిమాతో మీరు గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నా’ అని అన్నారు. మహేశ్ ప్రొడ్యూసర్ గా తెలుగు- హిందీ భాషల్లో నిర్మిస్తున్న ‘మేజర్’ సినిమాలో అడివి శేష్ హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే.