మజిలీ ‘నా గుండెల్లో’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

మజిలీ చిత్రం విడుదలై చాలా రోజులే అవుతున్నా అభిమానుల గుండెల్లో కదులుతూనే ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రలు పోషించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ చిత్రం తెరకెక్కింది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మజిలీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. తనంటే ఇష్టం లేని భర్తను ఇష్టంగా ఎలా మార్చుకుంది అనేది ఈ చిత్ర కథ.
ఈ చిత్రానికి సంబంధించి పలు వీడియోస్ విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా నా గుండెల్లో అనే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసింది. గోపి సుందర్ స్వరపరచిన సంగీతంకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన వీడియోపై మీరు ఓ లుక్కేయండి.