Rajasaab – Malavika Mohanan : ‘రాజా సాబ్’ సెట్స్‌లో హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ప్రభాస్ ఎక్కడ?
ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ జరుగుతుంది.

Malavika Mohanan Birthday Celebrations in Rajasaab Movie Sets Director Mrauthu Shares Photos
Rajasaab – Malavika Mohanan : ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా రాజాసాబ్ షూట్ లో హీరోయిన్ మాళవిక మోహనన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ నిర్వహించారు. నేడు తమిళ భామ మాళవిక మోహనన్ పుట్టిన రోజు. ప్రస్తుతం మాళవిక రాజాసాబ్ షూట్ లో ఉండటంతో షూటింగ్ సెట్లో మూవీ యూనిట్ మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ నిర్వహించారు.
రాజాసాబ్ షూటింగ్ సెట్స్ లో మాళవిక బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫోటోలను షేర్ చేసి డైరెక్టర్ మారుతి ఆమెకు టీమ్ లోకి వెల్కమ్ చెప్పాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే రాజాసాబ్ సెట్ కావడంతో ప్రభాస్ లేడా? బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ప్రభాస్ పాల్గొనలేదా? ప్రభాస్ ఎక్కడ అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Wishing you a very Happy Birthday @MalavikaM_! ?❤️
Happy to welcome you to Team #TheRajaSaab! We’re excited to make this film a memorable experience for you…Enjoy your special day! ??#TheRajaSaabOnApril10th pic.twitter.com/7TlwmwiD6C
— Director Maruthi (@DirectorMaruthi) August 4, 2024