Vishwambhara : ‘విశ్వంభర’పై హైప్ పెంచిన డైరెక్టర్.. కొత్త ప్రపంచం సృష్టిస్తున్నాను.. మెగాస్టార్ టాప్ 3 సినిమాల్లో..
విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు ఉండగా తాజాగా డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాపై అంచనాలు పెంచాడు.
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో భారీగా సోషియో ఫాంటసీ బ్యాక్ గ్రౌండ్ లో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది. త్రిష, ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ఈ సినిమా రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మూవీ యూనిట్. దీంతో చిరంజీవి విశ్వంభర సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు ఉండగా తాజాగా డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాపై అంచనాలు పెంచాడు.
Also Read : Tollywood Director : ఈ ఫొటోలో ఉన్న పిల్లాడ్ని గుర్తు పట్టారా..? స్టార్ డైరెక్టర్ ఇప్పుడు..
డైరెక్టర్ వశిష్ఠ మాట్లాడుతూ.. విశ్వంభర సినిమా ఆయన కెరీర్ లో టాప్ 10 సినిమాలు ఉంటే అందులో టాప్ 3లో ఉంటుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గురించి ఇప్పటికి ఎలా చెప్పుకుంటారో విశ్వంభర సినిమా గురించి కూడా అలా చెప్పుకుంటారు, చెప్పుకోవాలి. చాలా మంది స్టార్స్ తో కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నా. ఆ ప్రపంచం డిస్నీ ఫిలిమ్స్ లో చూపించినట్టు కొత్తగా గ్రాండ్ గా ఉంటుంది. ఈ సినిమా చాలా పెద్ద రేంజ్ లో ఉంటుంది. ఆడియన్స్ కి థ్రిల్ ఇస్తుంది అని తెలిపారు. దీంతో విశ్వంభరపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు చిరంజీవిని ఒక సరికొత్త సినిమాలో చూస్తామా అని ఎదురుచూస్తున్నారు.
Confidence chudu tamudu @DirVassishta #Mega156 https://t.co/Q6gNtsCMfe pic.twitter.com/QZPSb06R81
— ???? ??™? (@alwayskumar22) August 3, 2024