Tollywood Director : ఈ ఫొటోలో ఉన్న పిల్లాడ్ని గుర్తు పట్టారా..? స్టార్ డైరెక్టర్ ఇప్పుడు..

తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది.

Tollywood Director : ఈ ఫొటోలో ఉన్న పిల్లాడ్ని గుర్తు పట్టారా..? స్టార్ డైరెక్టర్ ఇప్పుడు..

Find These Tolywood Director with his Childhood Photo

Tollywood Director : అప్పుడప్పుడు మన సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయని తెలిసిందే. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఉన్న చిన్ని బాబు ఇప్పుడు స్టార్ డైరెక్టర్. టాలీవుడ్ లోనే కాదు ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు.

Also Read : Niharika – Naga Chaitanya : మెగా డాటర్ నిహారిక కోసం నాగ చైతన్య వస్తాడా?

ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? ఇంకెవరు మన దర్శకధీరుడు రాజమౌళి. రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ తాజాగా మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ తీసింది. ఇటీవల ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, రానా, ప్రభాస్, కీరవాణి, హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, రసో బ్రదర్స్.. ఇలా అనేకమంది మాట్లాడారు.

Find These Tolywood Director with his Childhood Photo

ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి పాత ఫోటోలు, వర్కింగ్ ఫోటోలు, చిన్నప్పటి ఫోటోలు కూడా చూపెట్టారు. రాజమౌళి చిన్నప్పుడు ఓ సినిమాలో కృష్ణుడి వేషం వేసిన ఫోటో కూడా చూపెట్టారు. దీంతో రాజమౌళి చిన్నప్పటి ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Find These Tolywood Director with his Childhood Photo