Niharika – Naga Chaitanya : మెగా డాటర్ నిహారిక కోసం నాగ చైతన్య వస్తాడా?
నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Naga Chaitanya for Niharika Konidela Committee Kurrollu Movie Rumours goes Viral
Niharika – Naga Chaitanya : మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిగానే కాకుండా నిర్మాతగా కూడా సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి 90s కిడ్స్ కోసం ఈ సినిమా స్పెషల్ అన్నట్టు ప్రమోట్ చేశారు.
ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 5న హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో జరగనుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగ చైతన్య వస్తాడని సమాచారం. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మూవీ యూనిట్ నాగ చైతన్యని సంప్రదించగా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ మ్యాగ్జిమమ్ వస్తాడనే చెప్పినట్టు తెలుస్తుంది.
Also Read : Rashmika – Puhspa 2 : పుష్ప 2 సాంగ్ పై రష్మిక కామెంట్స్.. ఆ డ్యాన్స్ వేయడానికి చాలా గంటలు పట్టింది..
మరి నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమా ఈవెంట్ కి నాగచైతన్య వస్తాడా లేదా చూడాలి. అయితే మెగా ఫ్యామిలిలో అంతమంది హీరోలు ఉండగా వాళ్ళందర్నీ కాదని నాగ చైతన్యని ఎందుకు పిలుస్తుంది నిహారిక అని ఆసక్తిగా మారింది.
#CommitteeKurrollu tho sandhadi cheseskundam, vaccheyandi! ??#CKPreReleaseJaathara on August 5th, 6 PM onwards, at Daspalla Convention! ✨️
In theatres from 9th August#CKonAUG9 ?@IamNiharikaK @SRDSTUDIOS_ @yadhuvamsi92 @eduroluraju @anudeepdev @anwaraliedit @manyam73 pic.twitter.com/PUy2kXywgD
— Pink Elephant Pictures (@PinkElephant_P) August 3, 2024