Malavika Mohanan: ప్రభాస్‌పైనే ఆశలు పెట్టుకున్న బ్యూటీ..!

తమిళంలో మాస్టర్ వంటి సినిమాలో నటించిన మాళవికా మోహనన్ అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే తెలుగులో దర్శకుడు మారుతి తెరకెక్కించే సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటించనుండటంతో, ఆయన ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు ఓకే చెబుతాడా అని ఈ బ్యూటీ ఎదురుచూస్తోంది.

Malavika Mohanan: ప్రభాస్‌పైనే ఆశలు పెట్టుకున్న బ్యూటీ..!

Malavika Mohanan Pins Hopes On Prabhas Maruthi Movie

Updated On : July 21, 2022 / 6:57 PM IST

Malavika Mohanan: తమిళ బ్యూటీ మాళవికా మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఓకే అంటాడా అని ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇంతకీ తమిళ నటి మాళవికా ఏ విషయంలో అంత ఆతృతగా ఎదురుచూస్తుంది..? ఆమెకు ప్రభాస్ ఎందుకు ఓకే చెప్పాలి..? అసలు వీరిద్దరి మధ్య సంబంధం ఏమిటి? అని అనుకుంటున్నారా.. అయితే అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. తమిళంలో మాస్టర్ వంటి సినిమాలో నటించిన మాళవికా మోహనన్ అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే సినిమాలకంటే ఎక్కువ అమ్మడికి సోషల్ మీడియా గుర్తింపే ఎక్కువని చెప్పాలి.

Malavika Mohanan : అందాలతో మెరిపిస్తున్న మాళవిక మోహనన్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ హాట్ అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటోంది ఈ బ్యూటీ. అయితే తెలుగులో దర్శకుడు మారుతి తెరకెక్కించే సినిమాలో ఈమెను హీరోయిన్‌గా తీసుకునేందుకు సంప్రదింపులు జరిపారు. మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త ఇప్పటికే టాలీవుడ్‌లో హల్‌చల్ క్రియేట్ చేస్తోంది. ఈ కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మారుతి తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. దీంతో మారుతి-ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోయే మూవీ అయోమయంలో పడిందనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

Malavika Mohanan : విజయదేవరకొండతో రొమాంటిక్ సినిమా చేయాలి అంటున్న తమిళ హీరోయిన్

కానీ.. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్న డివివి.దానయ్య మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఉండబోతుందని సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ప్రభాస్ ఈ సినిమాను ఎప్పుడె ఓకే చేస్తారా.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుందా అని మాళవికా మోహనన్ వెయిట్ చేస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండనుండగా, అందులో మాళవికా మోహనన్ ఒకరుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇవ్వాలని ఈ బ్యూటీ భావిస్తోంది. మరి ఈ బ్యూటీ ఆశలపై ప్రభాస్ ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తాడనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.