Viswanadhan
Music Director : ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మరణం మరవకముందే మరో మరణం కలవర పెడుతుంది. తాజాగా మలయాళ సినీపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ కైతప్రమ్ విశ్వనాథన్ నంబూద్రి కన్నుమూశారు. ఈయనకు కేవలం 58 సంవత్సరాలే. గత కొన్నాళ్లుగా ఈయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Rajamouli : అదే నా చివరి సినిమా : రాజమౌళి
1963లో సంగీత కుటుంబంలో జన్మించిన ఆయన మ్యూజిక్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. మలయాళంలో దాదాపు 20కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన చేసిన సేవలకు గాను ‘గానభూషణం’ అనే బిరుదును కూడా ఇచ్చారు. ‘కన్నకి’ చిత్రానికి 2001లో కేరళ ప్రభుత్వం స్టేట్ అవార్డుని సాధించారు. విశ్వనాథన్ మృతి పట్ల పలువురు మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.