Mohanlal : ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు మోహన్‌లాల్.. ఆందోళనలో ఫ్యాన్స్
నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురి అయ్యారు.

Mohanlal hospitalised
Mohanlal hospitalised : ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురి అయ్యారు. తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. కొచ్చిలోని అమృత ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 64 ఏళ్ల ఈ నటుడు ఐదు రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు మోహన్ లాల్ హెల్త్ బులిటెన్‌ను ఆస్పత్రి వర్గాలు విడుదల చేశాయి.
రద్దీ ప్రదేశాలతో పాటు షూటింగ్స్ కు కొన్నిరోజుల పాటు దూరంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. ఇక మోహన్ లాల్ ఆస్పత్రిలో చేరారు అన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Akash Jagannadh : ఈ సారి కొడితే గట్టిగా కొట్టాలి.. ఆకాశ్ జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక సినిమాల విషయానికి వస్తే.. మోహనల్‌లాల్ ప్రస్తుతం ఎంపురాన్ మూవీలో నటిస్తున్నారు. బరోజ్ అనే మూవీకి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. బరోజ్ మూవీ అక్టోబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Wishing @Mohanlal a speedy recovery! ❤️? pic.twitter.com/PjQ31OXcQa
— Sreedhar Pillai (@sri50) August 18, 2024