Akash Jagannadh : ఈ సారి కొడితే గట్టిగా కొట్టాలి.. ఆకాశ్ జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు ఆకాశ్ జగన్నాథ్.

Akash Jagannadh gave an update on his next film
Akash Jagannadh : స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు ఆకాశ్ జగన్నాథ్. ‘చిరుత’, ‘బుజ్జిగాడు’ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ‘మెహబూబా’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తరువాత ‘రొమాంటిక్’, ‘చోర్ బజార్’ వంటి మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే.. ఈ మూవీలు ఆశించిన ఫలితాలను సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా ఇటీవల తన పేరును ఆకాశ్ పూరీ నుంచి ఆకాశ్ జగన్నాథ్‌గా మార్చుకున్నట్లు వెల్లడించాడు.
ఇక తాజాగా.. రెండేళ్ల విరామం అనంతరం తన సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. చాలా రోజుల నుంచి తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ గురించి అందరూ అడుగుతూ ఉన్నారన్నాడు. అయితే.. తాను ఖాళీగా ఏం లేనని చెప్పాడు.
Ammaku Prematho : అమ్మను కావ్య కలుసుకుందా..? సరికొత్త సీరియల్ ‘అమ్మకు ప్రేమతో..’
చాలా జాగ్రత్తగా ఉంటున్నానని అన్నాడు. ఈ టైమ్‌లో తాను చాలా కథలను విన్నట్లుగా చెప్పాడు. ఒక గొప్ప అభిరుచిగల నిర్మాతను, అమేజింగ్ దర్శకుడితో పని చేయబోతున్నట్లుగా వెల్లడించాడు.
గతంలో ఎక్కువ కథలు విన్నప్పుడు తాను ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుండేవాడినని, అయితే.. దేవుడి దయవల్ల తాను నమ్మిన అమ్మవారి దయవల్ల ఓ మంచి టీమ్ సెట్ అయిందని తెలిపాడు. ఈ సారి కొడితే గట్టిగా కొట్టాలి అనే ఉద్దేశ్యంతోనే ఈ మూవీని ఫిక్స్ చేసినట్లుగా వెల్లడించాడు. ఆగస్టు 19న పూజా కార్యక్రమాలతో తన కొత్త సినిమా ప్రారంభం కాబోతుందని తెలిపాడు.
View this post on Instagram