KG George : చిత్ర పరిశ్రమలో విషాదం.. జాతీయ అవార్డు గ్రహీత కెజి జార్జ్ కన్నుమూత
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ (KG George) కన్నుమూశారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు.

Malayalam filmmaker KG George
Malayalam filmmaker KG George : చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ (KG George) కన్నుమూశారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా ఆయన పక్షవాతంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో కేరళ కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాన్ని తెలియజేస్తున్నారు.
కేజీ జార్జ్ మృతి మలయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కళాత్మక, వాణిజ్య సినిమాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఆయన పనిచేశాడని విజయన్ అన్నారు. మంగళవారం జార్జ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమం తెలిపింది.
1970లో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. స్వప్నదానం చిత్రానికి గానూ 1976లో జాతీయ అవార్డును అందుకున్నారు. వ్యామోహం, యవనిక, ఇరకల్, మేళా, ఎలవంకోడు దేశం, మహానగరం, ఆడమింటే వారియెల్లు లాంటి విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. తన కెరీర్‌లో తొమ్మిది రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా పొందాడు. మలయాళ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను 2015లో కేరళ ప్రభుత్వం జైసీ డేనియల్ అవార్డుతో సత్కరించింది.
Gopichand 32 : ఇటలీలో శ్రీను వైట్ల, గోపీచంద్ మూవీ.. యాక్షన్ మూవీతో..
ఆయన ఓ ఫిలిం స్కూల్ ను కూడా స్థాపించారు. అందులో నుంచి బయటకు వచ్చిన చాలామంది విద్యార్థులు గొప్ప గొప్ప నటులు అయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య సెల్మా జార్జ్, కుమారుడు అరుణ్ గోవాలో ఉన్నారని కూతురు తారా విదేశాలలో ఉన్నారని వృద్ధాశ్రమం తెలిపింది.