Manchu Lakshmi
Manchu Lakshmi : మంచు లక్ష్మీ ప్రసన్న మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా దక్ష. ది డెడ్‌లీ కాన్స్పిరసీ ట్యాగ్ లైన్. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తండ్రీ కూతుళ్లు మొదటి సారి కలిసి నటిస్తున్నారు. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా అక్క కోసం తమ్ముడు మంచు మనోజ్ గెస్ట్ గా హాజరయ్యాడు.(Manchu Lakshmi)
ఈ ప్రెస్ మీట్ లో దర్శకుడు డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ.. దక్ష ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో మోహన్ బాబు గారు సహా ఎంతోమంది పెద్దవాళ్లను డైరెక్ట్ చేశాను. విష్ణు అన్న కన్నప్ప, మనోజ్ అన్న మిరాయ్ సక్సెస్ అయినట్లే లక్ష్మి అక్క దక్ష కూడా హిట్ అవుతుంది అని అన్నారు.
Also Read : Beauty Movie : పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలతో.. ఆడపిల్లల తండ్రి ఎమోషన్ తో ఈ సినిమా వస్తుంది..
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. దక్ష కథను నా దగ్గరకు నాన్న గారు తీసుకొచ్చారు. ఈ సినిమాలో నాన్న గారి ఇమేజ్ కు తగినట్లు పర్పెక్ట్ క్యారెక్టర్ ఉంది. నాన్న గారి తర్వాత నన్ను అంత బాగా చూసుకునేది మనోజ్. అతను సినిమా చేయనప్పుడు ఇలాంటి మంచి ఆర్టిస్ట్ స్క్రీన్ మీద మళ్లీ ఎప్పుడు కనిపిస్తాడు అని ఒంటరిగా బాధపడ్డాను. మనోజ్ హీరోగానే కాదు విలన్ గానూ మెప్పించగలడు, కామెడీ చేయగలడు. దక్ష సినిమాకు మనోజ్ ఇచ్చిన సజెషన్స్ ను తీసుకున్నాను. మనోజ్ కు ఫిలిం మేకింగ్ మీద, ప్రతి క్రాఫ్ట్ మీద పట్టుంది. నాన్న గారితో అమితాబ్ పీకూ లాంటి మూవీ చేయాలని ఉంది అని తెలిపారు.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ.. నా మిరాయ్ సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నెక్స్ట్ అక్క, నాన్న కలిసి నటించిన దక్ష సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం అక్క చాలా కష్టపడింది. ప్రస్తుతం ప్రేక్షకులతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. దక్ష కూడా హిట్ అవ్వాలి. ఈ నెల మూవీ లవర్స్ కు ఫీస్ట్ లా ఉంటుంది. అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అని అన్నారు.
Also Read : Pawan Kalyan : OG హుడీ వేసి మరీ డబ్బింగ్ చెప్పించారుగా.. పవర్ స్టార్ పవర్ ఫుల్ డబ్బింగ్ ఫినిష్..