Manchu Lakshmi : ఆదిపర్వంలో మంచులక్ష్మీ.. ఫస్ట్ లుక్ చూస్తే భయపడాల్సిందే..

నేడు మంచు లక్ష్మి పుట్టిన రోజు కావడంతో మంచు లక్ష్మి కొత్త సినిమా ఆదిపర్వం(Adi Parvam) నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Manchu Lakshmi : ఆదిపర్వంలో మంచులక్ష్మీ.. ఫస్ట్ లుక్ చూస్తే భయపడాల్సిందే..

Manchu Lakshmi First Look released from Adi Parvam Movie

Updated On : October 8, 2023 / 2:41 PM IST

Manchu Lakshmi :  మోహన్ బాబు(Mohan Babu) కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి, తన మాటలు, ఇంటర్వ్యూలు, సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులని మెప్పించింది. తన మీద ట్రోల్స్ వచ్చినా ఎపుడూ ఏదో ఒక విషయంలో మంచు లక్ష్మి వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి కొన్ని బిజినెస్ లు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తుంది.

మంచు లక్ష్మి త్వరలో అగ్ని నక్షత్రం(Agni Nakshatram) అనే సినిమాతో రాబోతుంది. అది కాకుండా తాజాగా మరో కొత్త సినిమాతో రాబోతుంది. నేడు మంచు లక్ష్మి పుట్టిన రోజు కావడంతో మంచు లక్ష్మి కొత్త సినిమా ఆదిపర్వం(Adi Parvam) నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో మంచు లక్ష్మి చీర కట్టుకొని కూర్చొని కోపంగా అమ్మోరులా చూస్తుంది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

Manchu Lakshmi First Look released from Adi Parvam Movie

Also Read : Bigg Boss 7 : బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ స్పెషల్.. సిద్దార్థ్ క్లాస్, రవితేజ మాస్ ఎంట్రీ..

ఎర్రగుడి అమ్మవారి నేపథ్యంలో 1990 లలో జరిగిన కథగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ ఆదిపర్వం సినిమాలో మంచు లక్ష్మి మెయిన్ లీడ్ పోషించగా ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని.. మరికొంతమంది పలువురు ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. మంచు లక్ష్మి ఫస్ట్ లుక్ సీరియస్ గా భయపెట్టే విధంగా ఉండటంతో ఈసారి మరో కొత్తరకం క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.