మూడు సింహాల సింహాసనంపై మోహన్ బాబు

తన తండ్రి మోహన్ బాబు 70వ పుట్టినరోజు సందర్భంగా సింహాసనం చేయించిన మంచు లక్ష్మీ..

  • Published By: sekhar ,Published On : March 20, 2020 / 09:06 AM IST
మూడు సింహాల సింహాసనంపై మోహన్ బాబు

Updated On : March 20, 2020 / 9:06 AM IST

తన తండ్రి మోహన్ బాబు 70వ పుట్టినరోజు సందర్భంగా సింహాసనం చేయించిన మంచు లక్ష్మీ..

డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ, డాక్టర్. మంచు మోహన్ బాబు పుట్టినరోజు (మార్చి 19) కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది.. 2020తో ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టారు. 

తండ్రికి పుట్టినరోజు కానుకగా కుమార్తె లక్ష్మీ ప్రసన్న సింహాసనం చేయించింది. మోహన్ బాబు సింహాసనాసీనులై.. భార్య, కుమారులు, కుమార్తె, మనవరాలతో కలిసి తీసుకున్న ఫోటోను లక్ష్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

‘మా నాన్నకు కొత్త సింహాసనం.. ఈ సింహాసనంలోకి మూడు సింహాలు.. మా ముగ్గురికి (లక్ష్మీ, విష్ణు, మనోజ్) నిదర్శనం.. దీన్ని నేనే తయారు చేయించాను’ అని తెలిపింది.

కోరానా వైరస్ కారణంగా తిరుపతిలోని శ్రీవిద్యా‌నికేతన్‌లో జరగాల్సిన పుట్టినరోజు వేడుకలను రద్దు చేస్తూ మోహన్ బాబు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సినిమాల విషయానికొస్తే తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్న సూరరైపోట్రు’ (ఆకాశం నీ హద్దురా) చిత్రంలో నటిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My nana got a new simhasanam… 3 lions.. representing his 3 kids. Ya I made that up ? #mynanathebest #happybirthday #familytime #isolation

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on