Manchu Lakshmi : బాలీవుడ్ షోలో మంచు లక్ష్మి.. ‘ది ట్రైటర్స్’ ట్రైలర్ రిలీజ్.. బిగ్ బాస్ కి కాపీలా ఉందే..

తాజాగా మంచు లక్ష్మి ఓ బాలీవుడ్ షోలో పాల్గొనబోతుంది.

Manchu Lakshmi Karan Johar Uorfi Javed The Traitors Amazon Prime Show Trailer Released

Manchu Lakshmi : మంచు లక్ష్మి గత కొన్నాళ్లుగా ముంబైలోనే నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడే ఉంటూ బాలీవుడ్ లో ఛాన్సుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది. బాలీవుడ్ భామలతో కలిసి జిమ్ లకు, పార్టీలకు వెళ్తూ తెగ వైరల్ అవుతుంది. అయితే తాజాగా మంచు లక్ష్మి ఓ బాలీవుడ్ షోలో పాల్గొనబోతుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ది ట్రైటర్స్ అనే కొత్త షో మొదలుకాబోతుంది. జూన్ 12 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు ఒక కొత్త ఎపిసోడ్ రానుంది. తాజాగా ది ట్రైటర్స్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే బిగ్ బాస్ షోకి కాపీలా ఉంది. అయితే ఇది కూడా హాలీవుడ్ లో సక్సెస్ అయి ఇక్కడికి వచ్చింది.

Also Read : Shashtipoorthi : ‘షష్టిపూర్తి’ మూవీ రివ్యూ.. 37 ఏళ్ళ తర్వాత కలిసి నటించిన రాజేంద్రప్రసాద్ – అర్చన..

ఈ షోలో మన మంచు లక్ష్మి పాల్గొంటుంది. ట్రైలర్ లో మంచు లక్ష్మి ఏడ్చిన షాట్ కూడా పెట్టారు. అలాగే ఉర్ఫి జావేద్, ఆశిష్ విద్యార్ధి, శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రాలతో పాటు మరికొంతమంది బాలీవుడ్ లో ఫేమ్ ఉన్నవాళ్లు షోలో పాల్గొంటున్నారు. ఈ షోని కరణ్ జోహార్ హోస్ట్ చేయబోతున్నాడు. మరి ఈ షోలో మంచు లక్ష్మి ఎలా మెప్పిస్తుందో చూడాలి. మీరు కూడా ది ట్రైటర్స్ ట్రైలర్ చూసేయండి..

 

Also Read : Bhairavam : ‘భైరవం’ మూవీ రివ్యూ.. ముగ్గురు హీరోల కంబ్యాక్ అదిరిందిగా..