Manchu Manoj – Mounika : పండంటి పాపకు జన్మనిచ్చిన మంచు మనోజ్ దంపతులు.. మంచు లక్ష్మి స్పెషల్ పోస్ట్..

తాజాగా నేడు మౌనిక పండంటి పాపాయికి జన్మనిచ్చిందని మంచు లక్ష్మి తెలిపింది.

Manchu Manoj – Mounika : మంచు మనోజ్ కొన్నాళ్ల క్రితం మౌనికతో రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికే మౌనికకు ధైరవ్ అనే బాబు ఉన్నాడు. వీరి పెళ్లి తర్వాత ఇప్పటికే మనోజ్ – మౌనిక దంపతులు పలుమార్లు వైరల్ అయ్యారు. ఇద్దరూ కలిసి ఓ కొత్త బిజినెస్ కూడా మొదలుపెట్టారు. తమ ఫ్యామిలీ ఫొటోలు కూడా మనోజ్, మౌనిక అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నారు. గత డిసెంబర్ లో మౌనిక ప్రగ్నెంట్ అని తెలిపాడు మనోజ్.

తాజాగా నేడు మౌనిక పండంటి పాపాయికి జన్మనిచ్చిందని మంచు లక్ష్మి(Manchu Lakshmi) తెలిపింది. మనోజ్ – మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. మా ఇంట్లో దేవత వచ్చింది. మనోజ్ – మౌనిక దంపతులు పాపకి జన్మనిచ్చారు. అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు. అప్పుడే తనకి MM పులి అనే నిక్ నేమ్ కూడా పెట్టాము. శివుడి ఆశీస్సులు ఈ ఫ్యామిలీపై ఉండాలని కోరుకుంటున్నాను అని మంచు లక్ష్మి ట్విట్టర్లో పోస్ట్ చేసింది.


 

దీంతో మంచు లక్ష్మి పోస్ట్ వైరల్ గా మారగా మనోజ్ – మౌనిక దంపతులకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మంచు లక్ష్మి చేసిన ట్వీట్ ని మంచు మనోజ్ రీ ట్వీట్ చేశాడు.

Also Read : Satyam Rajesh : ‘టెనెంట్’ ట్రయలర్ రిలీజ్.. ఈ సినిమా చేశాక ఏడ్చేశాను.. సత్యం రాజేష్..

ట్రెండింగ్ వార్తలు