Satyam Rajesh : ‘టెనెంట్’ ట్రయలర్ రిలీజ్.. ఈ సినిమా చేశాక ఏడ్చేశాను.. సత్యం రాజేష్..

త్వరలో సత్యం రాజేష్ టెనెంట్(Tenant) సినిమాతో రాబోతున్నాడు.

Satyam Rajesh : ‘టెనెంట్’ ట్రయలర్ రిలీజ్.. ఈ సినిమా చేశాక ఏడ్చేశాను.. సత్యం రాజేష్..

Satyam Rajesh Emotional After Watching his Tenant Movie

Updated On : April 13, 2024 / 12:07 PM IST

Satyam Rajesh : సత్యం రాజేష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఒకప్పుడు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సత్యం రాజేష్ ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు తీస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఓ పక్క కమెడియన్ గా చేస్తూనే మరో పక్క హీరోగా కుడా చిన్న చిన్న సినిమాలు చేసి హిట్స్ కొడుతున్నాడు. త్వరలో సత్యం రాజేష్ టెనెంట్(Tenant) సినిమాతో రాబోతున్నాడు.

వై.యుగంధర్ దర్శకత్వంలో మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా టెనెంట్. సత్యం రాజేష్ తో పటు మేఘా చౌదరి, చందన, భరత్, ఎస్తర్ నొరోన్హ.. పలువురు ముఖ్య పాత్రలు పాత్రలు పోషిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. టెనెంట్ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ప్రియదర్శి ముఖ్య అతిథిగా వచ్చారు.

Also Read : Varun Sandesh : తన సినిమా రీ రిలీజ్ అవుతున్నట్టు హీరోకే తెలియదంట..

ట్రైలర్ చూస్తుంటే ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. దీంతో సత్యం రాజేష్ మరో హిట్ కొడతాడని భావిస్తున్నారు. ఈ ఈవెంట్లో సత్యం రాజేష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కథ చెప్పినట్టే తీశారు. సినిమా చేశాక డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏడ్చేశాను. డబ్బింగ్ లో సినిమా అంతా చూసి క్లైమాక్స్ లో ఏడ్చేసాను. నేను చేసిన సినిమా చూసి నేనే ఏడవడం ఇదే ఫస్ట్ టైం. సినిమా అంత ఎమోషనల్ గా ఉంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. ఇన్నాళ్లు జాగ్రత్తగా ఒక్కో పాత్ర చేసుకుంటూ వచ్చాను. గత మూడు నాలుగేళ్లుగానే సక్సెస్ చూసాను అని తెలిపారు.