Manchu Manoj : అనాథశ్రమంలో మంచు మనోజ్ పుట్టిన రోజు వేడుకలు..

మంచు మనోజ్ ఓ అనాథాశ్రమంలో తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. కుత్బుల్లాపూర్, గాజుల రామారంలోని కేర్ అండ్ లవ్ అనే అనాథశ్రమంలో అక్కడ ఉన్న చిన్నారుల మధ్య మనోజ్ తన పుట్టిన రోజు వేడుకల్ని చేసుకున్నాడు.

Manchu Manoj : అనాథశ్రమంలో మంచు మనోజ్ పుట్టిన రోజు వేడుకలు..

Manchu Manoj birthday celebrations in Orphanage

Updated On : May 21, 2023 / 11:29 AM IST

Manoj Birthday :  రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టిన రోజు వేడుకలు నిన్న మే 20న ఘనంగా చేసుకున్నారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న మనోజ్ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్లి తర్వాత ఇదే మొదటి పుట్టిన రోజు కావడంతో ఫ్యామిలీతో తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు మంచు మనోజ్. ఇక తన పుట్టిన రోజు సందర్భంగా తన రాబోయే రెండు సినిమాల అప్డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు.

Manchu Manoj birthday celebrations in Orphanage

Swapna Dutt : మా బ్యానర్ లో నటించిన వాళ్లంతా స్టార్స్ అవుతున్నారు.. ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ..

అలాగే నిన్న సాయంత్రం మంచు మనోజ్ ఓ అనాథాశ్రమంలో తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. కుత్బుల్లాపూర్, గాజుల రామారంలోని కేర్ అండ్ లవ్ అనే అనాథశ్రమంలో అక్కడ ఉన్న చిన్నారుల మధ్య మనోజ్ తన పుట్టిన రోజు వేడుకల్ని చేసుకున్నాడు. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం అక్కడి పిల్లలకు బ్యాగులు, స్వీట్స్, బొమ్మలు పంపిణి చేశారు మనోజ్. అక్కడ పిల్లలతో కాసేపు ముచ్చటించారు మనోజ్. దీంతో అభిమానులు, పలువురు నెటిజన్లు మనోజ్ ని అభినందిస్తున్నారు.

Manchu Manoj birthday celebrations in Orphanage