Manchu Manoj : అన్నతో గొడవ గురించి మీడియా ముందు మాట్లాడిన మనోజ్.. వాళ్ళని అడిగితే బాగా తెలుస్తుంది!

మంచు విష్ణుతో (Manchu Vishnu) గొడవ గురించి మనోజ్ (Manchu Manoj) మొదటిసారి మీడియా ముందు మాట్లాడాడు. నాకంటే వారిని అడిగితే బాగా చెబుతారు అంటూ చెప్పుకొచ్చాడు.

Manchu Manoj : టాలీవుడ్ లోని మంచు కుటుంబంలో గత కొన్ని రోజులుగా విబేధాలు చోటు చేసుకున్నాయి అని వార్తలు వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే సంగతి తెలిసిందే. ఇక ఇటీవల మంచు బ్రదర్స్ విష్ణుకి (Manchu Vishnu) అండ్ మనోజ్ (Manchu Manoj) గొడవ పడుతున్న వీడియో ఒకటి బయటకి వచ్చింది. ఆ వీడియోలో మంచు విష్ణు, మనోజ్ అనుచరుడు ఇంటిలోకి చొరబడి గొడవ చేస్తున్న విజువల్స్ కనబడ్డాయి. అయితే ఆ వీడియోని స్వయంగా మనోజ్ షేర్ చేయడంతో సోషల్ నెట్ వర్క్స్ అండ్ మీడియా ఛానల్స్ లో హాట్ టాపిక్ అయ్యిపోయింది.

Manchu Manoj : నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధం.. మంచు మనోజ్ సంచలన పోస్ట్!

దీంతో మోహన్ బాబు (Mohan Babu) ఎంట్రీ ఇచ్చి మనోజ్ చేత ఆ వీడియోని డిలీట్ చేయించాడు. అయితే ఈ విషయం గురించి మంచు కుటుంబసభ్యులు ఎవరు మాట్లాడని తరుణంలో.. తాజాగా మనోజ్ మీడియా ముందు ఈ విషయం గురించి నోరు విప్పాడు. టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి కొడుకు ‘మేఘాంశ్’ సినిమా ఓపెనింగ్ నేడు (మార్చి 27) గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు బాబీ, చోట కె నాయుడు, మనోజ్ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చిన మనోజ్ ని విలేకర్లు.. బయటకి వచ్చిన వీడియో గురించి ప్రశ్నించారు.

Manchu Vishnu Vs Manoj : విష్ణు, మనోజ్‌ల గొడవ‎పై మోహన్‌ బాబు ఆగ్రహం..

మంచు మనోజ్, ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ పేరు చెబుతూ.. ‘నాకంటే వారిని అడిగితే బాగా చెబుతారు’ అంటూ మాట దాటేశాడు. విలేకర్లు మళ్ళీ ఆ ప్రశ్న అడగగా, మనోజ్ బదులిస్తూ.. నేను మిమ్మల్ని కొరికేస్తాను అంటూ సీరియస్ అయ్యాడు. ఇది ఇలా ఉంటే, ఇటీవల మనోజ్ సోషల్ మీడియాలో మరో సంచలన పోస్ట్ కూడా వేశాడు. ”కళ్ళ ముందు జరుగుతున్నది తప్పు అని తెలిసి కూడా ఏమి తెలియనట్లు ఉండడం కంటే, నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధం”, ”క్రియేటివిటీకి నెగిటివిటీనే శత్రువు” అంటూ పోస్ట్ లు వేశాడు.

 

ట్రెండింగ్ వార్తలు