Manchu Manoj Comments On Ttd Laddu Row In Ap
Manchu Manoj : తిరుమల లడ్డూ వివాదంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు. లడ్డూలలో కలిపే నెయ్యిలో జంతువుల కొవ్వుని కలుపడం ఒక లోపం కాదని, ఇది విశ్వాస ఉల్లంఘన అని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ మన పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వును వాడారని ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం లోపం కాదు.. ఇది విశ్వాస ఉల్లంఘన. రాజకీయాలకు అతీతంగా హిందూ మనోభావాలకు అవమానం. ఈ తరుణంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని, బాధ్యులను గుర్తించి, జవాబుదారీతనం ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. మన సాంస్కృతిక, మతపరమైన విలువలను గౌరవించాలి. పవిత్ర సంప్రదాయాల ఉల్లంఘనలను సహించబోమని మనం ఒక ఉదాహరణగా నిలవాలి. అన్ని విశ్వాసాలను గౌరవించే దేశంగా మనకు ప్రియమైన వాటిని రక్షించుకోవడానికి మనం ఐక్యంగా ఉందాం.’ అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.
Nikhil Siddhartha : తిరుమల లడ్డూ వివాదం.. హీరో నిఖిల్ ట్వీట్.. ఏకంగా ప్రధానిని ట్యాగ్ చేస్తూ..
It’s deeply disturbing to learn that animal fat was used in our sacred Tirumala #SrivariLaddu , betraying the faith of millions of devotees. This is not just a lapse; it’s a breach of trust and an affront to Hindu sentiments that transcends politics. This moment calls for all… pic.twitter.com/xcAjdLII7u
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 22, 2024
మంచు మనోజ్ తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు దానిపై ఇప్పటికే దీనిపై స్పందించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.
నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కన్పించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతో పాటు వేలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం.
Vinay Rai : ఒకప్పుడు రొమాంటిక్ హీరో.. ఇప్పుడేమో స్టార్ విలన్.. ఎవరో గుర్తుపట్టారా..?
ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా.. ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా.’అని అన్నారు.
విజ్ఞప్తి pic.twitter.com/7l8UT9Fbs5
— Mohan Babu M (@themohanbabu) September 21, 2024