Manchu Manoj Marriage : తను చేసుకోబోయే వధువుని పరిచయం చేసిన మంచు మనోజ్.. పెళ్లికూతురు ఫోటో చూశారా?

గత కొంత కాలంగా మంచు మనోజ్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక రెండు రోజులు నుంచి వీరిద్దరూ మార్చి 3న పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన బయటకి రాలేదు. తాజాగా ఈ సందేహాల అన్నిటికి చెక్ పెడుతూ మంచు మనోజ్..

Manchu Manoj Marriage : తను చేసుకోబోయే వధువుని పరిచయం చేసిన మంచు మనోజ్.. పెళ్లికూతురు ఫోటో చూశారా?

Manchu Manoj officially confirms his Marriage news he shares his bride bhuma mounika reddy photo

Updated On : March 3, 2023 / 11:34 AM IST

Manchu Manoj Marriage : గత కొంత కాలంగా మంచు మనోజ్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. క్రిందటి సంవత్సరం గణేష్ ఉత్సవాల్లో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డితో కలిసి పూజలు నిర్వహించడంతో వీరిద్దరి పెళ్లి వార్తలు తెర పైకి వచ్చాయి. అయితే ఈ వార్తలు పై మంచు మనోజ్ గాని, ఇరువురి కుటుంబాలు గాని ఎక్కడ నోరు విప్పలేదు. ఇక రెండు రోజులు నుంచి వీరిద్దరూ మార్చి 3న పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన బయటకి రాలేదు.

Manchu Manoj Marriage : మనోజ్ పెళ్ళి దగ్గరుండి చేస్తున్న మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో మెహందీ వేడుకలు, డెకరేషన్ ఫోటోలు పోస్ట్..

కానీ మంచు వారి ఇంటి వద్ద మాత్రం పెళ్లి సందడి కనిపించడంతో ఈ వార్తలు నిజమే అనుకున్నారంతా. ఇక ఈరోజు (మార్చి 3) ఉదయం మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి డెకరేషన్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసినప్పటికీ, అది ఎవరి పెళ్లి అనేది మాత్రం తెలియజేయలేదు. తాజాగా ఈ సందేహాల అన్నిటికి చెక్ పెడుతూ.. మంచు మనోజ్ అధికారికంగా తన పెళ్లి వార్తని కన్‌ఫార్మ్ చేశాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా భూమా మౌనిక రెడ్డి ఫోటో షేర్ చేస్తూ.. ‘పెళ్లికూతురు భూమా మౌనిక రెడ్డి. మనోజ్ వెడ్స్ మౌనిక’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో వీరిద్దరి పెళ్లి వార్త అధికారికంగా నిజం అయ్యింది.

ఇక పోస్ట్ చూసిన నెటిజెన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సన్నిహితుల సమాచారం ప్రకారం ఈరోజు రాత్రి వీరిద్దరూ కలిసి ఏడు అడుగులు వేయబోతున్నారు అని తెలుస్తుంది. ఇక ముద్దులు తమ్ముడు మనోజ్ పెళ్లిని మంచు లక్ష్మి దగ్గర ఉండి చూసుకుంటుంది. వీరిద్దరి వివాహంతో మంచు, భూమా కుటుంబాలు ఒక్కటవ్వడంతో సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశం అయ్యింది. కాగా మనోజ్ అండ్ మౌనికలకు గతంలోనే విడివిడిగా వివాహం అయ్యింది. అయితే ఇద్దరు విడాకులు తీసుకోని మొదటి పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరికి ఇది రెండో పెళ్లి.