నలుగురు పిల్లలు.. నీకు వేరే పనిలేదా? అంటూ ఆటపట్టిస్తున్నారు..
నలుగురు పిల్లలు సరిపోతారా అంటూ ఆటపట్టిస్తున్నారు-మంచు విష్ణు..

నలుగురు పిల్లలు సరిపోతారా అంటూ ఆటపట్టిస్తున్నారు-మంచు విష్ణు..
మంచు మోహన్ బాబు నట వారసుడు మంచు విష్ణు రీసెంట్ ఇంటర్వూలో తనకు పిల్లలంటే చాలా ఇష్టమని చెబుతూ.. నలుగురు పిల్లల విషయంలో ఎవరెవరు తనను ఎలా ఆటపట్టిస్తున్నారో వివరించాడు. ‘నాకు పిల్లలంటు చాలా ఇష్టం.. నా ఫ్రెండ్స్ కొంతమంది కాల్ చేసి.. మేమేమో ఒకరు చాలనుకుంటున్నాం.. నీవల్ల మా ఇంట్లో తిట్లు తింటున్నాం.. అంటున్నారు.
ఇంకొంతమంది.. ఏంటి డార్లింగ్ ఇంకా సరిపోలేదా? కంటే కన్నావు కానీ ఆ విషయం ఇప్పుడే చెప్పాలా? పిల్లలకి పదహారేళ్లొచ్చాక చెప్పొచ్చు కదా అన్నారు. వినీ (విరానికా) వాళ్ల కుటుంబంలో అయితే జగనన్న కానీ (వైఎస్. జగన్ మోహన్ రెడ్డి), షర్మిలక్క కానీ, మా చెల్లెల్నిఇబ్బంది పెట్టడం ఆపెయ్.. అంటుంటారు.
సుబ్బిరామి రెడ్డి అంకుల్ అయితే ఏమయ్యా నీకు వేరే పనిలేదా అని ఆటపట్టిస్తుంటారు అని చెప్పుకొచ్చాడు విష్ణు. ప్రస్తుతం ‘మోసగాళ్లు’ సినిమాలో నటిస్తున్న విష్ణు.. త్వరలో రూ.60 కోట్ల బడ్జెట్‌తో ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపాడు.
See Also | సూట్‌లో ప్రభాస్ లుక్ కిరాక్.. డార్లింగ్ 20 మేకింగ్ వీడియో