Manchu Vishnu: కూతుళ్లను ఇంట్రొడ్యూస్ చేస్తున్న మంచు విష్ణు

Manchu Vishnu Introduces His Daughters In Ginna
Manchu Vishnu: టాలీవుడ్‌లో ఒకే ఫ్యామిలీ నుండి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మందే ఉన్నారు. అందులో మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీలు పాపులర్ అయ్యాయి. ఇక ఈ కుటుంబాల్లో నటీనటులతో పాటు ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుండి మరో ఇద్దరు వెండితెరపై తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. మంచు ఫ్యామిలీలో ఇంకా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతుంది ఎవరా అని అనుకుంటున్నారా.. వారు మరెవరో కాదు.. హీరో మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా.
Manchu Vishnu: ప్రీలుక్‌తోనే క్యూరియాసిటీ పెంచేసిన జిన్నా..!
మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జిన్నా’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈషాన్ సూర్య తెరకెక్కిస్తుండగా విష్ణు సరసన అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో మంచు విష్ణు మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను జూలై 24న ఉదయం 11.13 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఫ్రెండ్‌షిప్ సాంగ్‌గా రాబోతున్న ఈ పాటను మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానాలు పాడటం విశేషం.
Manchu Vishnu: ‘జిన్నా’గా మారిన గాలి నాగేశ్వర రావు!
ఇదే వారికి తొలి సినిమా కావడంతో వారిని ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో ఫ్రెండ్‌షిప్ సాంగ్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. తమను ఆదరిస్తున్నట్లుగానే తన కూతుళ్లను కూడా ఆశీర్వదించాలని మంచు విష్ణు ఈ సందర్భంగా కోరాడు. ఇక ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. జిన్నా చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
— Vishnu Manchu (@iVishnuManchu) July 20, 2022
— Vishnu Manchu (@iVishnuManchu) July 20, 2022