Manchu Vishnu key decision Actor Hema got suspended from Movie Artist Asociation
Hema – Manchu Vishnu : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లోని పలువురు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఈ విషయంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాగా.. తాజాగా హేమను మా నుంచి సస్పెండ్ చేయాలని యోచిస్తున్నారు.
హేమను సస్పెండ్ చేయాడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ మా అసోసియేషన్ గ్రూప్‌లో విష్ణు మెసేజ్ పెట్టారట. అధిక శాతం మంది సభ్యులు సస్పెండ్ చేయాలని రిప్లయ్‌లు ఇచ్చారట. దీంతో హేమకు క్లీన్‌చిట్ వచ్చేంత వరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారట. దీనిపై రేపు(గురువారం) అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో గత నెలలో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొంది. దీంతో ఆమెను విచారణకు హాజరు కావాలని బెంగళూరు పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదు. ఇటీవల మరోసారి నోటీసులు ఇవ్వగా విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా జూన్ 14వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.