Pawan Kalyan : ప‌వ‌న్ గెలుపుపై మ‌హేశ్‌, మ‌నోజ్ ట్వీట్లు.. ప్ర‌జ‌ల గురించి మీరు క‌న్న క‌ల‌లు నిజ‌మ‌వ్వాలి..

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సినీ ప‌రిశ్ర‌మ నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

Pawan Kalyan : ప‌వ‌న్ గెలుపుపై మ‌హేశ్‌, మ‌నోజ్ ట్వీట్లు.. ప్ర‌జ‌ల గురించి మీరు క‌న్న క‌ల‌లు నిజ‌మ‌వ్వాలి..

Mahesh and manoj tweets on pawan kalyan victory

Updated On : June 5, 2024 / 6:43 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కూట‌మి భారీ విజ‌యాన్ని సాధించింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతుంది. ఇక జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అంతేనా.. జ‌న‌సేన త‌రపున నిల్చున్న 21 మందిని ఎమ్మెల్యేలుగా, ఇద్ద‌రు ఎంపీలుగా గెలిపించుకున్నారు. దీంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సినీ ప‌రిశ్ర‌మ నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు ప‌వ‌న్‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, హీరో మంచు మ‌నోజ్ లు సైతం ప‌వ‌న్ కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేశారు.

Also Read: Kajal Aggarwal : డూప్ లేకుండా స్టంట్స్ చేశాను.. మా ఆయన నాకు చాలా సపోర్ట్ ఇస్తాడు..

‘ప‌వ‌న్ క‌ళ్యాణ్.. మీ అద్భుత విజ‌యానికి అభినంద‌నలు. ప్ర‌జ‌లు మీ పై ఉంచిన విశ్వాసం, న‌మ్మ‌కానికి ఈ విజ‌యం ప్ర‌తిబింబం. ప్ర‌జ‌లు గురించి మీరు క‌న్న క‌ల‌లు నిజ‌మ‌వ్వాలి’ అని మ‌హేశ్ బాబు ట్వీట్ చేశారు.

‘మా నిజ‌మైన ప‌వ‌ర్ స్టార్‌కి ప్ర‌త్యేక అభినంద‌న‌లు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ఘ‌న విజ‌యంతో మ‌రోసారి గేమ్ ఛేంజ‌ర్ అండ్ ప‌వ‌ర్ స్టార్‌గా మారారు. మీ ప్ర‌యాణం ప్ర‌తి ఒక్క‌రికి స్పూర్తినిస్తుంది అన్న. స‌వాళ్ల‌ను అధిగ‌మించి విజేత‌గా నిల‌వ‌డం అభినంద‌నీయం. మీరు మ‌రిన్ని విజ‌యాల‌ను అందుకోవాల‌ని, ప్ర‌జా సేవ‌లో త‌ర‌లించాలి. మేము ఎల్ల‌ప్పుడూ మీతోనే ఉంటాము అన్న’ అని మంచు మ‌నోజ్ ట్వీట్ చేశాడు.

Also Read : పిఠాపురం ఎమ్మెల్యే గారు.. అంటూ పవన్ పై వెంకీమామ ఆసక్తికర పోస్ట్..