Kajal Aggarwal : డూప్ లేకుండా స్టంట్స్ చేశాను.. మా ఆయన నాకు చాలా సపోర్ట్ ఇస్తాడు..
సత్యభామ ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ నేడు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

Kajal Aggarwal Talk about Satyabhama Movie in Promotions
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత తెలుగులో సత్యభామ(Satyabhama) సినిమాతో కంబ్యాక్ ఇస్తుంది. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాణంలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జూన్ 7న సత్యభామ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ నేడు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
కాజల్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. సత్యభామ సినిమాని నా పర్సనల్ లైఫ్ తో రిలేట్ చేసుకుంటా. నిజ జీవితంలో నేనూ సమాజంలో ఏదైనా జరిగితే స్పందిస్తుంటాను. ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ లాంటి ఎమోషనల్, యాక్షన్ సినిమా మొదటిసారి. నన్ను ఎప్పట్నుంచో టాలీవుడ్ చందమామ అనేవాళ్ళు ఇప్పుడు సత్యభామ అంటున్నారు. నాకు రెండూ ఇష్టమే. గతంలో జిల్లా సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించాను కానీ అది సీరియస్ కాదు. సత్యభామలో మాత్రం ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాను అని తెలిపింది.
Also Read : Venkatesh – Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యే గారు.. అంటూ పవన్ పై వెంకీమామ ఆసక్తికర పోస్ట్..
ఈ మూవీ టీమ్ గురించి చెప్తూ.. శశికిరణ్ మంచి డైరెక్టర్. ఆయన మేజర్, గూఢచారి సినిమాలు నాకు ఇష్టం. ఈ సినిమాకు డైరెక్షన్ ఎందుకు చేయడం లేదని కూడా అడిగాను. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ఇస్తూ ప్రెజెంటర్ గా ఉన్నాడు. డైరెక్టర్ సుమన్ చిక్కాల ఫస్ట్ టైమ్ డైరెక్షన్ అయినా చాలా క్లారిటీ ఉంది. మా ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళే. ఈ సినిమాలో యూత్, బెట్టింగ్ తో పాటు రిలీజియన్ గురించి కూడా కీ పాయింట్స్ ఉంటాయి. ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ ఉంటాయి అని తెలిపింది.
ఇక మొదటి సారి చేసిన యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుతూ.. సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం చాలా కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. వర్క్ షాప్స్ కూడా చేశాను. డూప్ లేకుండా స్టంట్స్ చేశాను. సుబ్బు మాస్టర్ యాక్షన్ సీక్వెన్సులు చాలా బాగా కొరియోగ్రాఫి చేశారు అని తెలిపింది.
పెళ్లి తర్వాత యాక్టింగ్ గురించి మాట్లాడుతూ.. పెళ్లయ్యాక హీరోయిన్ కెరీర్ గురించి అందరూ అడుగుతారు. అందరి లాగే హీరోయిన్స్ కు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. గతంలో పెళ్లయ్యాక హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుయోమో కానీ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. మా ఆయన నాకు వర్క్ విషయంలో చాలా సపోర్ట్ చేస్త్తారు. నా పేరెంట్ లైఫ్ ని, వర్క్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అని తెలిపింది.