Kannappa – Prabhas : వామ్మో.. కన్నప్ప సినిమా నిడివి ఎంతో తెలుసా? ప్రభాస్ ఎంతసేపు కనిపిస్తాడంటే.. ఫ్యాన్స్ కి పండగే..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నప్ప సినిమా నిడివి, ప్రభాస్, మోహన్ లాల్ సినిమాలో ఎంతసేపు కనిపిస్తారో చెప్పాడు.

Manchu Vishnu Tells about Kannappa Movie Length and Prabhas Mohan lal Screen appearance Timing

Kannappa – Prabhas : మంచు విష్ణు కన్నప్ప సినిమాని భారీగా, స్టార్ కాస్ట్ పెట్టి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. దీంతో మంచు విష్ణు ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారి ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేసారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నప్ప సినిమా నిడివి, ప్రభాస్, మోహన్ లాల్ సినిమాలో ఎంతసేపు కనిపిస్తారో చెప్పాడు.

Also Read : Naveen Polishetty : మెగాస్టార్ తో పోటీగా నవీన్ పోలిశెట్టి.. సంక్రాంతి బరిలో ‘అనగనగా ఒక రాజు’..

మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమా టైటిల్స్ అన్ని కలుపుకొని 3 గంటల 10 నిమిషాల నిడివి ఉంటుంది. అందులో ప్రభాస్ నిడివి ఎంత కట్ చేసినా 30 నిముషాలు ఉంటుంది. మోహన్ లాల్ సర్ 15 నిముషాలు కనిపిస్తారు. అయినా నిడివితో సంబంధం లేదు. రెండు గంటల నిడివి సినిమాలు కరెక్ట్ గా తీయకపోతే అవి కూడా లెంగ్త్ గానే ఉంటుంది. మూడు గంటల సినిమా కరెక్ట్ గా ఉంటే లెంగ్త్ పెద్దగా తెలియదు అని తెలిపారు.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటిస్తాడు అని చెప్పినప్పుడు గెస్ట్ అప్పీరెన్స్ లాగా ఓ 5 నిముషాలు కనిపిస్తాడేమో అనుకున్నారు. కానీ విష్ణు ఇప్పుడు ప్రభాస్ 30 నిముషాలు కనిపిస్తాడు అని చెప్పడంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోతూనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : Dil Raju : తెలంగాణలో మొత్తం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇన్నే.. అందులో నావి 30 మాత్రమే.. మిగిలినవి వాళ్ళవే..