Manchu Vishnu: నేడు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం..

Manchu Vishnu
Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుండగా ఇప్పటికే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు కార్యవర్గ సభ్యులు కూడా ఈరోజే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
Telugu Films Releases: టార్గెట్ డిసెంబర్.. అందరి చూపు ఈనెలపైనే!
తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలు తలపించేలా కాకలు రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు నుండే తీవ్రం ఆసక్తికరంగా మారిన ఈ ఎన్నికలు.. పోలింగ్ రోజు గొడవలు, మంచు విష్ణు విజయంతో ముగుస్తుందని ఆశించారు. కానీ.. మళ్ళీ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామా వంటి అంశాలతో ‘మా’లో రచ్చ కొనసాగుతుంది. చివరికి కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ప్రకాశ్ రాజ్ కోర్టు మెట్లెక్కబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.
Telugu New Films: కొత్త సినిమాల అనౌన్స్.. దసరా సర్‌ప్రైజ్‌లతో ఉక్కిరిబిక్కిరి!
మాలో జరుగుతున్న ఇన్ని పరిణామాల మధ్యే నేడు మా కొత్త కార్యకర్గం కొలువుదీరనుంది. అధ్యక్షుడిగా మంచు విష్ణుతో పాటు ఆయన పాలక వర్గం కూడా ఈరోజే ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరుకానుండగా.. మంచు విష్ణుతో పాటు ఆయన పాలన మండలి సభ్యులు కూడా తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తుంది. ఎవరు ఈ కార్యక్రమానికి హజరవుతారన్నది ఆసక్తిగా మారగా.. ప్రకాష్ రాజ్ వర్గం స్పందన ఉత్కంఠగా మారింది.