×
Ad

Anshu Ambani : ‘మన్మథుడు’ సమయంలో చాలా ఇబ్బందిని ఫేస్ చేశాను.. ఆయన వల్లే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాను..

మన్మథుడు సినిమా సమయంలో నేను చాలా ఇబ్బందిని ఫేస్ చేశాను. ఆయన వల్లే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాను అంటున్న హీరోయిన్ అన్షు అంబానీ.

  • Published On : February 23, 2024 / 11:45 AM IST

Manmadhudu Actress Anshu Ambani viral comments about her exit of industry

Anshu Ambani : నాగార్జున ‘మన్మథుడు’ సినిమాలో మహేశ్వరీ పాత్రలో నటిస్తూ హీరోయిన్ గా పరిచయమైన నటి ‘అన్షు అంబానీ’. ఆ మూవీలో తన నటన, అందంతో టాలీవుడ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’ సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఆ తరువాత శివాజీ ‘మిస్సమ్మ’ సినిమాలో ఓ అతిథి పాత్ర, తమిళంలో హీరోయిన్ గా ఓ సినిమా చేసి కెరీర్ కి ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

రాఘవేంద్ర మూవీ టైంలోనే ‘సచిన్ సగ్గర్’ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసారు. ఇప్పుడు వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే చేసిన రెండు సినిమాలతోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అన్షు.. సడన్ గా ఎందుకని యాక్టింగ్ కి ఫుల్‌స్టాప్ పెట్టేశారు అనేది ఎవరికి అర్ధం కాలేదు. ఇదే విషయాన్ని అన్షుని రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఆమె బదులిచ్చారు.

Also read : Kalki 2898 AD : కల్కి 9 భాగాలుగా రాబోతుంది.. యాక్టర్ అభినవ్ గోమఠం కామెంట్స్..

అన్షు అంబానీ మాట్లాడుతూ.. “నేను ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చినప్పుడు మన్మథుడు వంటి మంచి అవకాశం అందుకున్నాను. అయితే ఆ సమయంలో నేను చాలా ఇబ్బందిని ఫేస్ చేశాను. ఆ సమయానికి నేను చాలా యంగ్ కావడంతో మా నాన్న ఓవర్ ప్రొటెక్టీవ్‌గా ఉండేవారు. దీంతో నేను ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో కలవాలి అనేవి కూడా ఆయనే నిర్ణయించేవారు.

అలాంటి సిట్యుయేషన్స్ మధ్యలో సినిమా పరిశ్రమలో ఉండడం కరెక్ట్ కాదని అనిపించింది. అందుకే ఇప్పుడు సినిమా నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ కొన్నాళ్ళు తరువాత వద్దాము అని అనుకున్నాను. అందుకనే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాను” అంటూ పేర్కొన్నారు. ఈ వీడియోతో ఆమె తన తండ్రి వలనే ఆమె సినిమాలు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కాగా ఇటీవల మన్మథుడు మూవీ రీ రిలీజ్ టైములో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ రీ రిలీజ్ సమయంలోనే రీ ఎంట్రీ బెటర్ అనుకున్నారు ఏమో గానీ, ఈ ఇంటర్వ్యూలో.. ‘మళ్ళీ వచ్చాను’ అని చెబుతూ రీ ఎంట్రీని కన్ఫార్మ్ చేసేసారు. మరి రాబోయే సినిమాల్లో ఈమెను ఎలాంటి రోల్స్ చూస్తామో చూడాలి.