Kalki 2898 AD : కల్కి 9 భాగాలుగా రాబోతుంది.. యాక్టర్ అభినవ్ గోమఠం కామెంట్స్..

కల్కి 9 భాగాలుగా రాబోతుందంటూ టాలీవుడ్ నటుడు అభినవ్ గోమఠం.. తన రీసెంట్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Kalki 2898 AD : కల్కి 9 భాగాలుగా రాబోతుంది.. యాక్టర్ అభినవ్ గోమఠం కామెంట్స్..

abhinav gomatam comments about Prabhas Kalki 2898 AD movie

Updated On : February 23, 2024 / 11:05 AM IST

Kalki 2898 AD : ప్రభాస్ అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా ఈ చిత్రం రూపొందుతుండడంతో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ మూవీ మంచి క్యూరియాసిటీ నెలకుంది. కాగా ఈ మూవీ ఒకటికంటే ఎక్కువ భాగాలుగా రాబోతుందంటూ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వినిపిస్తున్న మాట.

అయితే ఈమధ్య కాలంలో ఈ సినిమా మొత్తం 9 భాగాలుగా రాబోతుందంటూ ఓ వార్త ఫిలిం వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆడియన్స్ లో మూవీ పై మరింత ఆసక్తి మొదలయింది. తాజాగా టాలీవుడ్ నటుడు అభినవ్ గోమఠం.. తన రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు.

Also read : Allu Arjun : ఇది రైజ్ మాత్రమే.. రానున్న కాలంలో ఇండియా రూల్ చూస్తారు..

అభినవ్ గోమఠం ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను కల్కి మూవీ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నాను. ఇక ఇటీవల ఈ మూవీ 9 పార్టులుగా రాబోతుంది అంటూ నేను విన్నాను. అది విన్న దగ్గర నుంచి సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన ఓ ప్రముఖ నటుడు ఇలా కామెంట్ చేయడంతో ఈ 9 భాగాలు వార్త సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతుంది.

కాగా ఈ మూవీ ప్రమోషన్స్ ని మార్చి నుంచి ఫుల్ స్వింగ్ లో చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మార్చి 8న శివరాత్రి పండుగ ఉన్న సంగతి తెలిసిందే. ఆరోజు టీజర్ ని రిలీజ్ చేసి.. గ్రాండ్ ప్రమోషన్స్ కి తెరలేపనున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మే 9న ఈ సినిమా తెలుగుతో పాటు ఇండియన్ లాంగ్వేజ్స్ అండ్ ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ కానుందట.