Manoj Bajpayee : “ఫ్యామిలీ మ్యాన్” హీరో ఫ్యామిలీలో విషాదం..

ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైన స్పై థ్రిల్లర్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్'తో పాన్ ఇండియా లెవెల్ లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న నటుడు "మనోజ్ బాజ్పాయ్". తెలుగులోనూ అడపాదడపా సినిమాల్లో కనిపించినా.. అల్లు అర్జున్ 'హ్యాపీ', పవన్ 'పులి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక విషయానికి వస్తే..

Manoj Bajpayee : “ఫ్యామిలీ మ్యాన్” హీరో ఫ్యామిలీలో విషాదం..

Manoj Bajpayee mother passed away

Updated On : December 8, 2022 / 5:37 PM IST

Manoj Bajpayee : ప్రముఖ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమైన స్పై థ్రిల్లర్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’తో పాన్ ఇండియా లెవెల్ లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న నటుడు “మనోజ్ బాజ్పాయ్”. ఈ వెబ్ సిరీస్ కంటే ముందే తన విలక్షణమైన నటనతో చిత్రసీమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. తెలుగులోనూ అడపాదడపా సినిమాల్లో కనిపించినా.. అల్లు అర్జున్ ‘హ్యాపీ’, పవన్ ‘పులి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Deepika Padukone : లేడీ సింగంగా మారుతున్న పద్మావతి..

ఇక విషయానికి వస్తే.. మనోజ్ ఇంటిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మనోజ్ తల్లి ‘గీతాదేవి’ ఈరోజు ఉదయం మరణించారు. గతకొన్ని రోజులుగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో కొన్నిరోజులుగా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సను అందిస్తుండగా, 80 ఏళ్ళ వయసులో తుది శ్వాసను విడిచారు. ఇక ఆమె మరణ వార్త తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

కాగా గత ఏడాది మనోజ్ బాజ్పాయ్ తండ్రి ‘రాధాకాంత్‌’ కూడా మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నుంచి కోలుకోక ముందే, మళ్ళీ ఇలా జరగడంతో మనోజ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతంలో పలు ఇంటర్వ్యూలో మనోజ్.. తన తల్లి ప్రతి విషయంలో సలహాలు ఇచ్చేదంటూ వెల్లడించిన విషయం తెలిసిందే.