‘అహం బ్రహ్మాస్మి’.. సీతా రామరాజు క్లాప్..

మంచు మనోజ్ కొత్త సినిమా ‘అహం బ్రహ్మాస్మి’ రామ్ చరణ్ క్లాప్‌తో ప్రారంభమైంది..

  • Published By: sekhar ,Published On : March 6, 2020 / 09:10 AM IST
‘అహం బ్రహ్మాస్మి’.. సీతా రామరాజు క్లాప్..

మంచు మనోజ్ కొత్త సినిమా ‘అహం బ్రహ్మాస్మి’ రామ్ చరణ్ క్లాప్‌తో ప్రారంభమైంది..

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్‌తో ప్రారంభమైంది. మనోజ్ ఎమ్ఎమ్ ఆర్ట్స్ పేరుతో బ్యానర్ స్థాపించి నిర్మాతగా న్యూ జర్నీ స్టార్ట్ చేసాడు. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పణలో శ్రీకాంత్ ఎన్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. మనోజ్ నిర్మిస్తున్న  ‘అహం బ్రహ్మాస్మి’.. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతోంది. ఈ చిత్రం మార్చి 6న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.(ఇదంతా పాతికేళ్ల అమ్మాయే చేసిందా? అనుష్క అదరగొట్టింది..)

మనోజ్‌పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి రామ్ చరణ్ క్లాప్ నివ్వగా, మంచు లక్ష్మీ, సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్చాన్ చేశారు. మోహన్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ‘ఆర్ఆర్ఆర్’ లో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న చరణ్ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నాడని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. అడుగడునా చెర్రీపై పూలవర్షం కురిపించారు. ఎల్లో షర్ట్, బ్లూ జీన్స్, మెలితిరిగిన మీసాలతో చెర్రీ లుక్ అదిరిపోయింది.

ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 
అడిషనల్ డైలాగ్స్: దివ్య నారాయణన్, కల్యాణ్ చక్రవర్తి
పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్
సంగీతం: అచ్చు రాజమణి, రమేష్ తమిళమణి
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి
ఎడిటింగ్: తమ్మిరాజు
ఆర్ట్: వివేక్ ఎ.ఎం.
స్టంట్స్: పీటర్ హేన్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ చల్లగుళ్ల
నిర్మాతలు: నిర్మలాదేవి మంచు, మనోజ్ కుమార్ మంచు
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: శ్రీకాంత్ ఎన్. రెడ్డి.
 

Manoj Manchu's Aham Brahmasmi Movie Launching

Manoj Manchu's Aham Brahmasmi Movie Launching