Manyam Dheerudu : థాయిలాండ్ ఫిలిం ఫెస్టివల్ లో మన్యం ధీరుడు సాంగ్ పై ప్రశంసలు..
థాయిలాండ్ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా, ఈ సినిమా సాంగ్స్ ని ప్రదర్శించారు.

Manyam Dheerudu Song gets Appreciations in Thailand Film Festival
Manyam Dheerudu : ఇటీవల రంగస్థల నటుడు RVV సత్యనారాయణ సీతారామరాజు పాత్రలో అల్లూరి సీతారామరాజు జీవిత కథతో మన్యం ధీరుడు అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. RCC మూవీస్ బ్యానర్ పై పార్వతిదేవి సమర్పణలో నరేష్ డెక్కల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 20న ఈ సినిమా విడుదల అయింది. తాజాగా ఈ సినిమాని పలు దేశాల్లో ప్రదర్శిస్తున్నారు.
Also Read : Akira Nandan : నిజంగానే అకిరా నందన్ పవన్ OG సినిమాతో ఎంట్రీ ఇస్తాడా..?
ఈ క్రమంలో థాయిలాండ్ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా, ఈ సినిమా సాంగ్స్ ని ప్రదర్శించారు. మన్యం ధీరుడు సినిమాలోని ‘నమోస్తుతే నమోస్తుతే భారత మాతా..’ అనే దేశభక్తి గీతం అక్కడి ఫెస్టివల్ లో ప్రశంసలు అందుకుంది. ఈ పాటకు తుంబలి శివాజీ రాయగా పవన్ కుమార్ సంగీత దర్శకత్వంలో RVV సత్యనారాయణ పాడారు. ఈ సాంగ్ ని హిమాలయాల్లో షూట్ చేసారు.
త్వరలో ఈ సాంగ్ ని అమెరికా తానా, జర్మనీ సభల్లో కూడా ప్రదర్శించబోతున్నామని మూవీ యూనిట్ తెలిపింది.