Akira Nandan : నిజంగానే అకిరా నందన్ పవన్ OG సినిమాతో ఎంట్రీ ఇస్తాడా..?
పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఓజీ.

Akira Nandan will Acting in Pawan Kalyan OG Movie Rumours goes Viral
Akira Nandan : పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాల్లో విపరీతంగా హైప్ ఉన్న ప్రాజెక్ట్ ఓజీ. స్టోరీ దగ్గరనుంచి స్టార్ కాస్ట్ వరకూ, పవన్ లుక్ దగ్గరనుంచి పాటల వరకూ ప్రతీదీ ఫాన్స్ కి మోస్ట్ ఎగ్జైటింగ్ ఎలిమెంటే. అయితే ఇప్పటికే ఉన్న ఎగ్జైట్ మెంట్ కి తోడు పవన్ వారసుడు కూడా ఓజీ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఓజీ. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలకి కంప్లీట్ డిఫరెంట్ గా ఓజీని పిక్చరైజ్ చేస్తున్నారు. పవన్ రాజకీయాల బిజీతో ఆగిన ఈ షూట్ ఇప్పుడు మల్లి మొదలైంది. ఇటీవలే OG షూట్ మొదలైందని మూవీ యూనిట్ ప్రకటించారు. పవన్ నవంబర్ రెండో వారంలో షూట్ లో జాయిన్ అవుతారని సమాచారం.
Also Read : Indian Rich Actress : ఇండియాలో అత్యంత ధనిక నటి ఎవరో తెలుసా? పదేళ్లుగా ఒక్క హిట్ లేకపోయినా..
అయితే లేటెస్ట్ గా ఓజీలో ఆడియన్స్ ని మరింత ఎగ్జైట్ చేసే న్యూస్ వైరల్ అవుతోంది. ఓజీ లోకి పవన్ కొడుకు అకీరానందన్ కూడా వస్తున్నట్టు న్యూస్. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ ఓజీతో ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎం అయిన దగ్గరనుంచి పవన్ తో పాటు కొన్ని ఈవెంట్స్ లో కనిపించిన అకీరా ఇప్పుడు ఏకంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్. అది కూడా పవన్ కళ్యాణ్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ ఓజీలో అనగానే ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి క్యారెక్టర్ లో అకీరా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు సంబంధించిన కోర్స్ చేస్తున్న అకీరా ఓజీ తో ఎంట్రీ ఇస్తున్నాడన్న న్యూస్ తో సోషల్ మీడియాలో సందడి స్టార్ట్ అయ్యింది. అలాగే కొన్ని రోజుల క్రితం అకిరా కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. OG సినిమా కోసం పవన్ కూడా మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ పట్టుకున్నారు. దీంతో నిజంగానే అకిరా ఈ సినిమాలో కనిపిస్తాడని భావిస్తున్నారు ఫ్యాన్స్.
పవన్ కళ్యాణ్ ఓజీ లో గ్యాంగ్ స్టర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ఓజీ నుంచి రిలీజైన టీజర్లు, పవన్ ఫోటోలు సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఓజస్ గంభీర క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ కే ఫాన్స్ ఎగ్జైట్ అవుతుంటే ఇప్పుడు అకీరా కూడా యాడ్ అయ్యే సరికి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఫీలవుతున్నారంతా. ఇప్పటికే సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ గా క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నారు. హీరోయిన్ గా ప్రియాంకా మోహన్ నటిస్తోంది. సలార్ భామ శ్రియారెడ్డి, తమిళ్ స్టార్ అర్జున్ దాస్ ముఖ్య పత్రాలు చేస్తున్నారు. వీళ్లకి తోడు మరికొంతమంది ఇంట్రస్టింగ్ స్టార్ కాస్ట్ ఉన్నారు. అయితే వీటన్నిటికీ హైలైట్ గా నిలవబోతున్నారు అకీరా. అయితే అకీరా సినిమాలో జస్ట్ క్యామియో రోల్ మాత్రమే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా పవన్ ,అకీరాని ఒకే సినిమాలో చూస్తామన్న ఫాన్స్ ఆనందానికి మాత్రం హద్దే లేకుండా పోయింది. 6 నెలల గ్యాప్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసిన ఓజీ ఈ ఇయర్ ఎండ్ కే షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. ఇంత వరకూ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యని ఓజీ థియేటర్లోకొచ్చేదెప్పుడో, తండ్రీ కొడుకుల్ని చూసేదెప్పుడో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.