Wow.. ఈ హీరోని గుర్తుపట్టారా!

  • Published By: sekhar ,Published On : July 25, 2020 / 02:46 PM IST
Wow.. ఈ హీరోని గుర్తుపట్టారా!

Updated On : July 29, 2020 / 10:07 AM IST

యువ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలుగా శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న చిత్రం ప్రీలుక్ ను విడుదల చేశారు. సూపర్ ఫిట్ గా వెనుకనుండి కనిపిస్తున్న నాగశౌర్య ప్రీలుక్ విశేష స్పందన రాబట్టి ఫస్ట్ లుక్ మీద అంచనాలు పెంచింది. NS 20 Prelook



ప్రతి సినిమాలో తన స్పెషాలిటీని నిరూపించుకుంటూ ‘ఛలో, ఓ బేబీ, అశ్వద్ధామ’ వంటి హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో నాగశౌర్య కొత్త సినిమా #NS20 ఫస్ట్ లుక్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల జూలై 27న ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. ఆసక్తికరమైన ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ దశలో ఉంది.