Ravi Teja : రవితేజ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది.. ‘మాస్ జాతర’.. రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

Mass Maharaaj Ravi, Teja new film title is MASS JATHARA
మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ కెరీర్‌లో 75వ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక.
దీపావళి సందర్భంగా తాజాగా ఈ చిత్ర టైటిల్ ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి మాస్ జాతర అనే పేరును పెట్టారు. జాతర సందడిలో, దీపావళి పండుగను తలపిస్తూ టపాసుల వెలుగుల నడుమ, తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్న రవితేజ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రాన్ని మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
NBK109 : ‘నన్ను క్షమించండి’.. NBK109 టైటిల్ అప్డేట్ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్..
ధమాకా విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వీరి కాంబినేషన్ మరోసారి థియేటర్లలో మాస్ బ్లాస్ట్ అవ్వనునుంది. ఈ చిత్రానికి, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Get ready for a Re-Sounding Entertainer 💥
Presenting our 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl in an out-and-out ‘MASS JATHARA’ 🧨🧨🎇
BLASTING the screens with highly
MASSIVE & EXPLOSIVE entertainment from MAY 9th, 2025 😎 💣Wishing you all a very #HappyDiwali 🧨🪔… pic.twitter.com/k2CTLGdKMV
— Sithara Entertainments (@SitharaEnts) October 30, 2024