Nayanthara : లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార డాక్యుమెంట‌రీ.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Nayanthara : లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార డాక్యుమెంట‌రీ.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Nayanthara Documentary Beyond The Fairy Tale Streaming From November 18th

Updated On : October 30, 2024 / 3:15 PM IST

Nayanthara : లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ద‌క్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా.. ఆమె వృత్తి, వ్య‌క్తిగ‌త జీవితంపై ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ పేరుతో దీన్ని న‌వంబ‌ర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నుంది. ఈ విష‌యాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

వాస్త‌వానికి న‌య‌న‌తార సినిమాల్లోకి అనుకోకుండా వ‌చ్చారు. కాలేజీ రోజుల్లో పార్ట్‌టైమ్ ఆమె మోడ‌ల్‌గా పని చేశారు. ఓ సంద‌ర్భంలో ఆమెను చూసిన ద‌ర్శ‌కుడు స‌త్య‌న్ అంతికాడ్ మ‌న‌స్సిక్క‌రే చిత్రంలో అవ‌కాశం ఇచ్చాడు. తొలుత దానిని తిరస్కరించిన ఆమె చివరకు ఓకే చెప్పారు. అలా 2003లో మ‌ల‌యాళ సినిమా ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన న‌య‌న్‌.. మ‌ల‌యాళం, త‌మిళం, తెలుగు చిత్రాల్లో న‌టించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Yash: వివాదంలో చిక్కుకున్న కన్నడ హీరో యశ్.. ప్రభుత్వం సీరియస్

ఇక నేను రౌడినే సినిమా చేస్తున్న స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న ఈ ఇద్ద‌రు 2022లో పెళ్లి చేసుకున్నారు. కాగా.. డాక్యుమెంట‌రీలో చిన్న‌ప్ప‌టి నుంచి న‌య‌న‌తార పెళ్లి వ‌ర‌కు చూపించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. న‌య‌న్ పెళ్లి వేడుక‌ డిజిట‌ల్ హ‌క్కుల‌ను రూ.25 కోట్లు వెచ్చించి నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

YVS Chowdary : నంద‌మూరి నాలుగో త‌రం న‌టుడిని చూశారా? హరికృష్ణ మనవడి ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది..