Yash: వివాదంలో చిక్కుకున్న కన్నడ హీరో యశ్.. ప్రభుత్వం సీరియస్
కన్నడ సూపర్ స్టార్ యశ్ వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త మువీ ‘టాక్సిక్’ షూటింగ్ కోసం ఇష్టానుసారంగా ..

KGF star Yash
Yash Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యశ్ వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త మువీ ‘టాక్సిక్’ షూటింగ్ కోసం ఇష్టానుసారంగా చెట్లను నరికివేశారంటూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, తాజాగా ఆ ప్రాంతంలో చెట్ల నరికివేతపై ప్రభుత్వం విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలతో పంచాయితీ మొదలైంది. యశ్ నటిస్తున్న టాక్సిక్ మూవీ చిత్రీకరణ షూటింగ్ బెంగళూరు సమీపంలోని పీణ్య – జలహళ్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కోసం వందలాది చెట్లను హిందుస్థాన్ మెషన్ ట్రూల్స్ (హెచ్ఎంటీ) అక్రమంగా నరికివేసిందంటూ కర్ణాటక పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు.
Also Read: Darshan : అభిమాని హత్య కేసులో.. కన్నడ హీరో దర్శన్‌కు మధ్యంతర బెయిల్..
ప్రభుత్వ ఆదేశాలతో సినిమా చిత్రీకరణ సైట్ ను మంత్రి పరిశీలించి అటవీ ప్రాంతంలో చెట్లను ఏ మేరకు నరికివేశారనే విషయాన్ని పరిశీలించారు. అంతేకాక శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన ఆయన చిత్ర యూనిట్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చెట్లను నరికివేసిన ప్రాంతాన్ని తాను స్వయంగా పరిశీలించానని, ఆ ప్రాంతంలో గతేడాది పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నట్లుగా శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించిందని మంత్రి ఈశ్వర్ ఖండ్రే చెప్పారు. నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోకుండా అటవీ భూమిలో వేలాది చెట్లను నరికివేయడం శిక్షార్హమైన నేరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని బెంగళూర్ కార్పొరేషన్ కు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. చిత్ర యూనిట్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలియజేశారు.
Also Read: YVS Chowdary : నందమూరి నాలుగో తరం నటుడిని చూశారా? హరికృష్ణ మనవడి ఫస్ట్ లుక్ వచ్చేసింది..
నిజానికి ఈ భూమి హెచ్ఎంటీ సంస్థది. ఆ సంస్థ మూతపడడంతో కెనరా బ్యాంకు కు విక్రయించారు. అనంతరం ఆ భూమిలో చెట్ల ప్లాంటేషన్ జరిగింది. అయితే, చెట్లు నరికివేయాలంటే అది ప్రభుత్వ భూమి అయినా, ప్రయివేట్ భూమి అయినా అటవీశాఖ అనుమతి తీసుకోవాలి. కానీ, టాక్సిక్ చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికివేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. గతంలోనూ ఇక్కడ షూటింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో చెట్లు నరికేశారా.. ఎలాంటి అనుమతులు తీసుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి చెట్లు నరికివేసిన కారణంగా యశ్ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం చెట్లు నరికివేసిన ప్రాంతంలో షెట్ తీసేస్తారా.. ప్రభుత్వం ఫైన్ విధించి సినిమా షూటింగ్ కోసం అనుమతి ఇస్తుందా..? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ಎಚ್.ಎಂ.ಟಿ. ವಶದಲ್ಲಿರುವ ಅರಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ ‘ಟಾಕ್ಸಿಕ್’ ಎಂಬ ಚಲನಚಿತ್ರದ ಚಿತ್ರೀಕರಣಕ್ಕಾಗಿ ನೂರಾರು ಮರಗಳನ್ನು ಅಕ್ರಮವಾಗಿ ಕಡಿದು ಹಾನಿಗೊಳಿಸಿರುವ ವಿಚಾರ ಗಂಭೀರ ಚಿಂತೆ ಮೂಡಿಸಿದೆ. ಸ್ಯಾಟೆಲೈಟ್ ಚಿತ್ರಗಳಿಂದ ಈ ಅಕ್ರಮ ಕೃತ್ಯವು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕಾಣುತ್ತಿದ್ದು, ಇಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಿದ್ದೇನೆ. ಈ ಅಕ್ರಮ ಕೃತ್ಯಕ್ಕೆ… pic.twitter.com/yrjHhG9kLA
— Eshwar Khandre (@eshwar_khandre) October 29, 2024