Darshan : అభిమాని హత్య కేసులో.. కన్నడ హీరో దర్శన్‌కు మధ్యంతర బెయిల్..
అభిమాని హత్య కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన కన్నడ నటుడు దర్శన్‌కు కాస్త ఊరట లభించింది.

Actor Darshan gets interim bail for 6 weeks in Renukaswamy murder case
Darshan : అభిమాని హత్య కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన కన్నడ నటుడు దర్శన్‌కు కాస్త ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. వైద్య చికిత్స కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో షరతులను విధించింది.
వెన్నునొప్పి, మూత్రపిండాల సంబంధిత అనారోగ్యం, కాళ్ల నరాల్లో రక్తప్రసరణ లేక ఇబ్బంది పడుతున్నాడని, సర్జరీ చేయించుకునేందుకు బెయిల్ ఇవ్వాలని సెషన్స్ కోర్టులో దర్శన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది.
YVS Chowdary : నందమూరి నాలుగో తరం నటుడిని చూశారా? హరికృష్ణ మనవడి ఫస్ట్ లుక్ వచ్చేసింది..
దీంతో దర్శన్ న్యాయవాధి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ జరిపిన న్యాయస్థానం ఆరువారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దర్శన్ తన పాస్‌పోర్టును ట్రయల్ కోర్టులో సరెండర్ చేయాలనే షరతు విధించింది.
రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కేసులో దర్శన్ ను జూన్ 11న అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు స్నేహితురాలు పవిత్ర గౌడ 15 మంది అరెస్ట్ చేశారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ ను, బెంగళూరు కోర్టు ఆదేశాల మేరకు ఇటీవల బళ్లారి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
Unstoppable 4 : దుల్కర్ సల్మాన్ ఎంత స్పీడ్‌తో కారు నడుపుతాడో తెలుసా?