Master Bharath : నటుడు మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట్లో తీవ్ర విషాదం..

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Master Bharath : నటుడు మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట్లో తీవ్ర విషాదం..

Master Bharath mother passed away

Updated On : May 19, 2025 / 12:10 PM IST

తెలుగు ప్రేక్ష‌కుల‌కు మాస్ట‌ర్ భ‌ర‌త్‌ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌రిచ‌యం అయి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా.. ఆయ‌న ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న త‌ల్లి కమలహాసిని క‌న్నుమూసింది.

చెన్నైలో నివాసం ఉంటుండ‌గా ఆదివారం రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో గుండెపోటుతో ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విషాద ఘటన చలనచిత్ర పరిశ్రమలోనూ, మాస్టర్ భరత్ అభిమానులలోనూ తీవ్ర విచారాన్ని నింపింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియజేస్తూ, భరత్ కుటుంబానికి అండగా నిలుస్తామని పేర్కొంటున్నారు.

Yashmi Gowda : చిన్నప్పటి నుంచి అందరూ ఏడిపించేవాళ్లు.. మా నాన్న రెండేళ్లు నాతో మాట్లాడలేదు..

వెంకీ, రెడీ, ఢీ, కింగ్ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ద‌గ్గ‌ర అయ్యాడు మాస్ట‌ర్ భ‌ర‌త్‌. పెద్ద వాడు అయ్యాక న‌టుడిగా ప‌లు చిత్రాల్లోనూ న‌టించాడు. ప్ర‌స్తుతం సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో చేస్తున్నాడు.

కాగా.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాస్ట‌ర్ భ‌ర‌త్ మాట్లాడుతూ.. త‌న త‌ల్లితో ఉన్న అనుభందాన్ని చెప్పాడు. ప్ర‌స్తుతం మెడిసిన్ పూర్తి చేసి అందులోనే డాక్ట‌రేట్ చేస్తున్న‌ట్లు చెప్పాడు. ఇంత పెద్ద‌వాడిని అయ్యాక కూడా.. తాను ఇంకా అమ్మ‌చాటు బిడ్డ‌నేన‌ని అన్నాడు. అమ్మ కోసం ఏదైన చేస్తాను అని తెలిపాడు.