Lovely Teaser : ‘లవ్లీ’ టీజర్ చూశారా? ఇదేదో రాజమౌళి ఈగ సినిమాలా ఉందే.. ఈగ అమ్మాయిగా మాట్లాడితే..

రాజమౌళి ఈగ సినిమా లాంటిదే మలయాళంలో వస్తుంది.

Mathew Thomas Lovely Teaser Released Looks like Rajamouli Eega Movie

Lovely Teaser : రాజమౌళి ఈగ సినిమా అందరికి గుర్తుంది. అప్పట్లో అదొక అద్భుతం. హీరో చనిపోయి ఈగగా మారి హీరోయిన్ ని విలన్ నుంచి ఎలా రక్షించాడు అని ఆసక్తికరంగా తెరకెక్కించారు. అప్పట్లోనే ఈగ సినిమా కోసం గ్రాఫిక్స్ కి బాగా ఖర్చు చేసి వండర్ ఫుల్ సినిమా ఇచ్చారు. అలాంటి సినిమాలు హాలీవుడ్ లో కొన్ని ఉన్నా ఇప్పుడు రాజమౌళి ఈగ సినిమా లాంటిదే మలయాళంలో వస్తుంది.

వెస్ట్రన్ ఘాట్స్ ప్రొడక్షన్స్, నేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శరణ్య, అమర్ రామచంద్రన్ నిర్మాణంలో దిలీష్ కరుణాకరన్ దర్శకత్వంలో మ్యాథ్యు థామస్ మెయిన్ లీడ్ గా లవ్లీ సినిమా తెరకెక్కుతుంది. ప్రేమలు, జాబిలమ్మ నీకు అంత కోపమా.. లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు మ్యాథ్యు థామస్. తాజాగా ఈ లవ్లీ సినిమా టీజర్ రిలీజ్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

Also Read : Divi – Pawan Kalyan : ఆయన వాయిస్ లో కమాండింగ్ ఉంటుంది.. ఏపీలో డిప్యూటీ సీఎంగా.. పవన్ పై దివి ఆసక్తికర వ్యాఖ్యలు..

టీజర్ లో ఓ అమ్మాయి చనిపోయాక ఈగలా పుట్టి హీరో దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. మరి ఆ అమ్మాయి ఎవరు? ఈగలా వచ్చి హీరో దగ్గరికి ఎందుకు వచ్చిందంటే సినిమా చూడాలి. టీజర్ అయితే ఆసక్తిగానే ఉంది. రాజమౌళి సినిమాలో ఈగ మాట్లాడదు. కాని ఇందులో ఈగ మాట్లాడటం గమనార్హం. మీరు కూడా ఈ లవ్లీ టీజర్ చూసేయండి..

ఇక ఈ లవ్లీ సినిమా ఏప్రిల్ 4న మలయాళంలో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మరి రాజమౌళి ఈగ సినిమాకు దీనికి సంబంధం ఏమైనా ఉందా లేక కేవలం ఈగని ఇన్ స్పిరేషన్ గా తీసుకొని కొత్త కథతో వస్తున్నారా అనేది చూడాలి.