Divi – Pawan Kalyan : ఆయన వాయిస్ లో కమాండింగ్ ఉంటుంది.. ఏపీలో డిప్యూటీ సీఎంగా.. పవన్ పై దివి ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా నటి దివి కూడా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Actress Divi Vadthya Interesting Comments on AP Deputy CM Pawan Kalyan
Divi – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని అభిమానించేవాళ్ళు ప్రజల్లోనే కాదు సెలబ్రిటీల్లో కూడా ఉన్నారని తెలిసిందే. చాలామంది సినిమా సెలబ్రిటీలు కూడా పవన్ ని అభిమానిస్తారు, పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ గా సపోర్ట్ చేస్తారు. గతంలో కూడా చాలా మంది స్టార్స్ పవన్ కి బహిరంగంగా సపోర్ట్ చేసిన వాళ్ళే. తాజాగా నటి దివి కూడా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నటి దివి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. తాజాగా దివి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.
Also Read : Sreeleela Dance : అక్కడ పనిచేస్తున్న మహిళలతో శ్రీలీల క్యూట్ డ్యాన్స్ చూశారా..? వీడియో వైరల్..
ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగా.. ఆయన సినిమాల్లోనే కాదు, పొలిటికల్ గా కూడా ఇష్టం. ఆయన వాయిస్ లో ఒక కమాండింగ్ ఉంటుంది. పవర్ ఫుల్ గా ఉంటారు. ఆయన ఏం మాట్లాడతారు అని ఆయనకు తెలుసు. ఆయన కరెక్ట్ గా మాట్లాడతారు. ఆయనకు ఏం చేయాలో తెలుసు, అది చేస్తున్నారు కూడా. ఏపీలో డిప్యూటీ సీఎం గా చాలా పనులు చేస్తున్నారు. ఆయనతో పని చేయాలి అని ఉంది. ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది దివి. దీంతో పవన్ ఫ్యాన్స్ దివి వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారిని ఎప్పుడూ కలవలేదు కాని ఆయన గురించి గొప్పగా విన్నాను. ఆయన చిరంజీవి కంటే గొప్ప అని, మంచివారు అని విన్నాను అని తెలిపింది. అలాగే.. చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ సినిమాలో చేస్తున్నప్పుడు ఆయన చాలా విషయాలు నేర్పించారు. పిలిచి మరీ ఫుడ్ పెట్టారు. అందరితో చాలా బాగుంటారు. నా కెరీర్ కి బిగ్ బాస్ ద్వారా నాగార్జున గారు ఓ 50 శాతం సపోర్ట్ చేస్తే గాడ్ ఫాదర్ తో చిరంజీవి గారు ఓ 50 శాతం సపోర్ట్ చేసారు అని తెలిపింది దివి.