సెన్సార్ పూర్తి : ‘బ్యాడ్ జోక్స్ బ్యాటిల్’ వీడియో విడుదల

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది..

  • Published By: sekhar ,Published On : October 29, 2019 / 05:14 AM IST
సెన్సార్ పూర్తి : ‘బ్యాడ్ జోక్స్ బ్యాటిల్’ వీడియో విడుదల

Updated On : October 29, 2019 / 5:14 AM IST

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది..

విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి ‘ఏ కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్’ బ్యానర్‌పై, ‘పెళ్లిచూపులు’ మూవీతో తనకి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌‌ని హీరోగా, షమ్మీర్ సుల్తాన్‌ని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల మహేష్ బాబు రిలీజ్ చేసిన ట్రైలర్, విజయ్ నటించిన ‘కథ చెబుతా విను’ వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ చేపడుతుంది మూవీ టీమ్..

ఆ ప్రాసెస్‌లో భాగంగా ‘బ్యాడ్ జోక్స్ బ్యాటిల్’ వీడియో విడుదల చేశారు. రీసెంట్‌గా సెన్సార్ పనులు పూర్తయ్యాయి.. సినిమా చూసిన సెన్సార్ టీమ్ ఎటువంటి కట్స్ చెప్పకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అభినవ్ గౌతమ్, అనసూయ భరద్వాజ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ, జీవన్ ఇతర పాత్రల్లో నటించారు.

Read Also : మెగా ఫ్యామిలీ‌పై సినిమా : వర్మ హోల్‌సేల్‌గా వీపీలని చేశాడుగా!

నవంబర్ 1న ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, సంగీతం : శివకుమార్, ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని, నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ, రచన-దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్.