Meenaakshi Chaudhary : బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఏడ్చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..

మీనాక్షి తాజాగా తన బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఎమోషనల్ అయింది.

Meenaakshi Chaudhary Got Emotional in her Birth Day Celebrations arranged by Fans

Meenaakshi Chaudhary : ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న హీరోయిన్స్ లో మీనాక్షి చౌదరి ఒకరు. మీనాక్షి తాజాగా తన బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఎమోషనల్ అయింది. డాక్టర్ చదివి డెంటిస్ట్ గా మారి ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా గెలిచి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఓ హిందీ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగులో ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

గత సంవత్సరం ఏకంగా 6 సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది మీనాక్షి చౌదరి. ది గోట్, లక్కీ భాస్కర్, గుంటూరు కారం.. సినిమాలతో హిట్స్ కొట్టింది. ఇటీవల సంక్రాంతికి వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టింది. నేడు మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. అయితే కొంతమంది ఆమె ఫ్యాన్స్ ఆమెకు సర్ ప్రైజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు.

Also Read : Agent : హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత అయ్యగారి సినిమా ఓటీటీలోకి.. ట్రైలర్ కూడా రిలీజ్.. ఎప్పుడు? ఏ ఓటీటీలో?

ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయడంతో ఫ్యాన్స్ కోరిక మేరకు మీనాక్షి చౌదరి అక్కడికి వెళ్ళింది. ఆమె రావడంతోనే పేపర్ బ్లాస్ట్ లతో, అరుపులతో హంగామా చేసారు ఫ్యాన్స్. అనంతరం ఆమె మాట్లాడి కేక్ కట్ చేసింది. అయితే అంతమంది ఫ్యాన్స్ తనపై చూపించిన ప్రేమకు ఎమోషనల్ అయింది మీనాక్షి. అందరికి థ్యాంక్స్ చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. తన బర్త్ డే ని ఫ్యాన్స్ అంతా కలిసి సెలబ్రేట్ చేయడంతో మీనాక్షి చౌదరి సంతోషం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయింది. మీనాక్షి ఎమోషనల్ అయిన వీడియో మీరు కూడా చూసేయండి..

https://www.youtube.com/shorts/TO_N-PK-e04

Also Read : Tamannaah – Vijay Varma : ఇదో కొత్త రకం బ్రేకప్.. తమన్నా – విజయ్ వర్మ రెండేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పి..

దీంతో మీనాక్షి చౌదరి ఎమోషనల్ అయిన వీడియో వైరల్ గా మారింది. మీనాక్షిని అలా చూసి ఏడవద్దు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మీనాక్షి త్వరలో అనగనగా ఒక రాజు సినిమాతో రానుంది. మరో రెండూ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయని సమాచారం.